స్త్రీ శక్తి ఉచిత బస్సు ప్రయాణ పథకం విజయవంతం :ఆర్టీసీ ఎండి ద్వారకా తిరుమలరావు

స్త్రీ శక్తి ఉచిత బస్సు ప్రయాణ పథకం విజయవంతం ఆర్టీసీ ఎండి ద్వారకా తిరుమలరావు
రేపల్లె డిపోను సందర్శించిన ఆర్టీసీ ఎండి ద్వారకా తిరుమల రావు
ద్వారకా తిరుమలరావుకు వినతి పత్రం అందజేస్తున్న కిషోర్ బాబు
రేపల్లె సెప్టెంబరు 17 యువతరం న్యూస్:
రాష్ట్ర వ్యాప్తంగా మహిళల కోసం ప్రత్యేకంగా ప్రవేశపెట్టిన స్త్రీ శక్తి పథకం మహిళల ఆదరణతో విజయవంతం అయిందని రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ద్వారకాతిరుమల రావు పేర్కొన్నారు. బుధవారం రేపల్లె ఆర్టీసీ డిపోను ఎండి తిరుమలరావు సందర్శించి
డిపో, గ్యారేజీ పరిసరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఆగస్టు 15 తేదీన రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించిన మహిళల ఉచిత బస్సు ప్రయాణం మహిళల ఆదరణతో విజయవంతమైందని ప్రవేశపెట్టిన ఐదు రకాల ఆర్టీసీ సర్వీసులలో మహిళలు 90 శాతం వరకు సద్వినియోగం చేసుకుంటున్నారని తెలిపారు. ఆయా డిపోల పరిధిలో ఓఆర్ కూడా గతం కన్నా 60 నుండి 65 % వరకు పెరిగిందని అన్నారు ఇతర రాష్ట్రాలతో పోలిస్తే మన రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం సజావుగా సాగుతూ విజయవంతం అయిందన్నారు.
రానున్న రోజుల్లో అన్ని డిపోలలో ప్రయాణికులకు మౌలిక వసతులు కల్పించి మెరుగైన సేవలు అందిస్తామన్నారు. దసరా పండుగ సందర్భంగా ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాల్లో ఆయా గమ్యస్థానాలకు వెళ్లేందుకు ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా ప్రత్యేక ఆర్టీసీ సర్వీసులు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. రానున్న కొద్ది నెలల్లో కొత్తగా మరికొన్ని కొత్త బస్సులు కొనుగోలు చేస్తున్నట్లు ఆయన చెప్పారు. కార్యక్రమంలో బాపట్ల జిల్లా ప్రజా రవాణా శాఖ అధికారి డి సామ్రాజ్యం, ఆర్టీసీ జోనల్ ఎగ్జిక్యూటివ్ సభ్యుడు సురేష్ కుమార్, డిపో మేనేజర్ సునీల్ కుమార్. డిపోలోని ఆయా కార్మిక సంఘాల నాయకులు గ్యారేజీ సిబ్బంది ఉద్యోగులు, కార్మిక సంఘాల నాయకులు ఎండి ద్వారకా తిరుమలరావును పూలదండలతో శాలువాలతో ఘనంగా సత్కరించారు. తొలిసారిగా రేపల్లె డిపోకు వచ్చిన ఎండి ద్వారకా తిరుమల రావుకు ఉద్యోగులు కార్మికులు యూనియన్ నాయకులు అధికారుల నుంచి అపూర్వ స్వాగతం లభించింది.