ANDHRA PRADESHBREAKING NEWSOFFICIALSTATE NEWS

సెప్టెంబర్ 18, 19 వ తేదీలలో కర్నూలు మార్కెట్ యార్డ్ కు సెలవు

జాయింట్ కలెక్టర్ డా.బి.నవ్య

సెప్టెంబర్ 18, 19 వ తేదీలలో కర్నూలు మార్కెట్ యార్డ్ కు సెలవు

ఆ తేదీలలో ఎమ్మిగనూరు మార్కెట్ యార్డ్ లో ఉల్లి క్రయ విక్రయాలు జరుగుతాయి

సెప్టెంబర్ 18, 19 తేదీలలో కర్నూలు మార్కెట్ యార్డ్ లో ఉల్లి బహిరంగ వేలం నిర్వహణ

జాయింట్ కలెక్టర్ డా.బి.నవ్య

కర్నూలు కలెక్టరేట్ సెప్టెంబర్ 16 యువతరం న్యూస్:

సెప్టెంబర్ 18, 19 తేదీలలో కర్నూల్ మార్కెట్ యార్డ్ కు సెలవు ప్రకటించామని జాయింట్ కలెక్టర్ డా.బి.నవ్య తెలిపారు.17 వ తేదీన మార్కెట్ యార్డ్ కు ఉల్లి పంట ఎక్కువ వచ్చే అవకాశం ఉన్నందున,.మార్కెట్ యార్డ్ పూర్తి గా నిండిపోయినందున, నిలువ ఉన్న ఉల్లి ను ట్రేడింగ్ మరియు బహిరంగ వేలం ద్వారా బయటికి తరలించడానికి మరియు రైతులకు ఇబ్బంది లేకుండా 18 వ,19 వ తేదీలలో కర్నూలు మార్కెట్ యార్డ్ కు సెలవు ప్రకటించడం జరిగిందని, అలాగే ఆ తేదీలలో ఎమ్మిగనూరు మార్కెట్ యార్డ్ లో ఉల్లి క్రయ విక్రయాలు జరుగుతాయని జాయింట్ కలెక్టర్ వివరించారు. రైతులు ఈ విషయాన్ని గమనించి ఉల్లిని 18 మరియు 19 తేదీలలో కర్నూలు మార్కెట్ యార్డ్ కు తీసుకొని రాకుండా ఎమ్మిగనూరు మార్కెట్ యార్డ్ కు తీసుకెళ్ళమని జాయింట్ కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. 18 వ & 19 వ తేదీలలో కర్నూలు మార్కెట్ యార్డ్ లో ఉల్లి బహిరంగ వేలం నిర్వహిస్తామని, రిటైలర్స్, హోల్సేలర్స్, హోటల్స్ యాజమాన్యాలు తదితరులు బహిరంగ వేలంలో పాల్గొనాలని జాయింట్ కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. రైతులు ఉల్లి పంట కోతకు వచ్చేవరకు అనగా నాటిన 100 నుండి 120 రోజులవరకు తమ పొలంలో ఉంచి పక్వానికి వచ్చిన తర్వాత మాత్రమే కోయాలని రైతులకు జాయింట్ కలెక్టర్ డా.బి.నవ్య సూచించారు. రైతులు పండించిన ఉల్లి పంటకు సరైన ధర లేకపోవడం వలన వ్యాపారస్తులు సరియైన ధర ఇవ్వక రైతుల నష్ట పోకూడదని ఉద్దేశంతో ప్రభుత్వము మద్దతు ధర రూపాయలు 1200 క్వింటా కు నిర్ణయించింది. ట్రేడర్స్ కొనుగోలు చేసిన తరవాత మిగిలిన ఉల్లి ని మార్క్ ఫెడ్ ద్వారా 31.08.2025 నుండి కర్నూలు మార్కెట్ యార్డ్ నందు కొనుగోలు చేయడం ప్రారంభించడం జరిగినది. ట్రేడర్స్ కొన్న ధరకు మద్దతు ధరకు ఉన్న వ్యత్యాసపు ధరను ప్రభుత్వం రైతులకు జమచేయ్యడం జరుగుతుంది. ట్రేడర్స్ కొనని ఉల్లిని ప్రభుత్వం మార్క్ ఫెడ్ ద్వారా రూపాయలు 1200 క్వింటా కి కొనుగోలు చేస్తుంది. ఇప్పటివరకు రైతుల నుండి దాదాపుగా 6000 టన్నుల ఉల్లి పంటను రైతులు నష్టపోకూడదని ఉద్దేశంతో క్వింటాలకు 1200 రూపాయలు చెల్లించి కర్నూలు మార్కెట్ యార్డ్ నందు కొనుగోలు చేస్తూ ఇతర జిల్లాల రైతు బజార్లకు, ఇతర జిల్లాల మార్కెట్లకు, పౌరసరఫరాలకు మరియు హోటల్ వారికి సరఫరా చేయగా మిగిలిన ఉల్లి పంట ను గోదాముల్లో నిల్వచేసినను రోజు రోజుకు మార్కెట్ కు రైతులు తెచ్చే ఉల్లి పంట వ్యాపారస్తులు కొనలేకపోవడం వలన స్థలాభావం వలన మరియు నాణ్యతలేని ఉల్లిని రైతులు తెస్తున్నాకొనుగోలు చెయ్యడం వలన కొంత ఉల్లి కుళ్ళుతున్నది. కుళ్ళిన ఉల్లి పంటను డంపుయార్డ్ కు ఉల్లిని తరలిస్తూ రైతులకు ఇబ్బంది కలగకుండా వారికి యార్డు లో స్థల సౌకర్యం కల్పిస్తూ కొనుగోలు చేయడం జరుగుతోందని జాయింట్ కలెక్టర్ తెలిపారు.

YUVATHARAM NEWS

Related Articles

Back to top button
error: Content is protected !!