
విశాఖలో ఇంజినీర్స్ డే వేడుకలు
ఆర్.వి.ఆర్.కు ఘనసత్కారం
ఉత్తరాంధ్ర ప్రతినిధి సెప్టెంబర్ 16
యువతరం న్యూస్:
బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (విశాఖపట్నం సెంటర్) ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం
ఎం ఆర్ సి కాకతీయ కన్వెన్షన్ సెంటర్లో ఇంజినీర్స్ డే–2025ను ఘనంగా జరిపారు. భారత రత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి సందర్భంగా నిర్వహించిన ఈ వేడుకలకు ప్రముఖ ఇంజినీరింగ్ నిపుణులు, నిర్మాణరంగ ప్రతినిధులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆర్వీఆర్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్, బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా మాజీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు డా. రాయల వెంకటేశ్వరరావు ని ఘనంగా సత్కరించారు. ఇటీవల గీతం యూనివర్సిటీ నుండి హానరరీ డాక్టర్ ఆఫ్ లెటర్స్ (డి.ఎల్ ఐ టి టి.) డిగ్రీ అందుకున్న సందర్భంగా బిల్డర్స్ అసోసియేషన్ ఈ సత్కారం నిర్వహించింది.
ముఖ్య అతిథిగా హాజరైన బ్రిగేడియర్ సుశిల్ కుమార్ (డీడీజీ & సీఈ, డైరెక్టర్ జనరల్ నావల్ ప్రాజెక్ట్స్, విశాఖపట్నం) ప్రత్యేక ప్రసంగంలో, ఇంజినీర్ల కృషి దేశ అభివృద్ధిలో అపూర్వమని, అందులో డా. ఆర్.వి.ఆర్. సేవలు చిరస్మరణీయమని అన్నారు.
కార్యక్రమంలో బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా విశాఖపట్నం చైర్మన్ నవనీత్ హానరరీ సెక్రటరీ ఎం.ఎన్. మూర్తి తదితరులు పాల్గొన్నారు. అనంతరం విందుతో కార్యక్రమం ముగిసింది.