విచారణ జరిపి చట్టపరంగా న్యాయం చేస్తాం
కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపియస్

విచారణ జరిపి చట్టపరంగా న్యాయం చేస్తాం
కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపియస్
ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెస్సల్ సిస్టం) కార్యక్రమానికి 81 ఫిర్యాదులు
ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక ద్వారా స్వీకరించిన ఫిర్యాదుల పై త్వరితగతిన స్పందించి, పరిష్కరించాలని పోలీసు అధికారులను ఆదేశించిన జిల్లా ఎస్పీ
ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులు మోసపోకండి
పోటి పరీక్షల ప్రతిభ ఆధారంగానే ఉద్యోగాలు వస్తాయి
డబ్బులు ఇస్తే ఉద్యోగాలు ఇస్తామని చెప్పే వ్యక్తులను ఎవ్వరిని నమ్మవద్దు,
మోసపోవద్దు .. జిల్లా ఎస్పీ
కర్నూలు క్రైమ్ సెప్టెంబర్ 17 యువతరం న్యూస్:
కర్నూల్ కొత్తపేటలోని కర్నూల్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ ప్రక్కన ఉన్న ఎస్పీ క్యాంపు కార్యాలయంలో కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం కు వచ్చిన ప్రజల సమస్యల వినతులను స్వీకరించి ఫిర్యాది దారులతో జిల్లా ఎస్పీ మాట్లాడి వారి యొక్క సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమానికి ఈ రోజు మొత్తం 81 ఫిర్యాదులు వచ్చాయి.
వచ్చిన ఫిర్యాదుల్లో కొన్ని ..
1) నా భార్యకు ఎస్ బి ఐలో అసిస్టెంట్ మెనేజర్ ఉద్యోగం ఇప్పిసామని చెప్పి మాసుమాన్ దొడ్డి గ్రామానికి చెందిన ఉపేంద్ర రూ. 5 లక్షలు తీసుకొని మోసం చేశాడని ఎమ్మిగనూరు , మసీదు పురం గ్రామానికి చెందిన కొండయ్య ఫిర్యాదు చేశారు.
2) డిజిటల్ అరెస్టు పేరుతో తెలియని వ్యక్తులు ఫోన్ చేసి భయాందోళనకు గురి చేశారని, వాట్సాప్ లో ఫేక్ వారెంట్ పంపి 2 రోజుల పాటు ఎవరికి చెప్పనివ్వకుండా భయ బ్రాంతులకు గురి చేసి, ఆస్తులను సీజ్ చేస్తామని నానా రకాలుగా ఇబ్బందులకు గురి చేసి రూ. 8 లక్షల 40 వేలు తీసుకున్నారని రికవరీ చేసి న్యాయం చేయాలని కర్నూలుకు చెందిన ఒక వ్యక్తి ఫిర్యాదు చేశారు.
3) నా కంది పంట ను ముగ్గురు వ్యక్తులు కలిసి ఉద్ధ్యేశపూర్వకంగా నాశనం చేసి నష్టం కలిగించారని చట్ట ప్రకారం న్యాయం చేయాలని ఉలిందకొండ గ్రామం కు చెందిన ప్రవీణ్ కుమార్ ఫిర్యాదు చేశారు.
4) జామీను(ష్యూరిటి)ఇచ్చి ట్రాక్టర్ ఇప్పించాను. ట్రాక్టర్ తీసుకున్న రామాంజనేయులు గౌడ్ నమ్మించి, మోసగించి ట్రాక్టర్ తో ఉడాయించి వెళ్ళిపోయాడు , పరారీలో ఉన్న అతని పై చర్యలు తీసుకోవాలని కర్నూలు, సోమిశెట్టి నగర్ కు చెందిన సుదర్శన్ ఫిర్యాదు చేశారు.
5) ఇల్లు బాడుగ కి ఇచ్చాము. కోర్టు ద్వారా ఉత్తర్వులు వచ్చినా కూడా ఖాళీ చేయకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని కర్నూలు, బుధవార పేట కు చెందిన మాదక్క ఫిర్యాదు చేశారు.
6) మండల సర్వేయర్ , గ్రామ సర్వేయర్ , గ్రామ తలారి , వి.ఆర్.ఓ, కురువ తిప్పన్న కలిసి 3 ఎకరాల 70 సెంట్ల భూమి లో కొంత భాగాన్ని ఆక్రమించడానికి పొలం దగ్గర హద్దు రాళ్ళు తీసివేసి ముందుకు జరిపినారని న్యాయం చేయాలని పత్తికొండకు చెందిన పెద్దహుల్తెన్న ఫిర్యాదు చేశారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమానికి వచ్చిన ఫిర్యాదులన్నింటి పై చట్ట ప్రకారం విచారణ జరిపి, బాధితులకు న్యాయం చేస్తామని, సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తామని ఈ సంధర్భంగా కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ హామీ ఇచ్చారు. ఈ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ హుస్సేన్ పీరా , సీఐ లు పాల్గొన్నారు.