ఇంటింటా ఫీవర్ సర్వే, లార్వా సర్వే నిర్వహించాలి

ఇంటింటా ఫీవర్ సర్వే, లార్వా సర్వే నిర్వహించాలి
జిల్లా ఉప వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఖాజా మొద్దీన్
పులివెందుల సెప్టెంబర్ 15 యువతరం న్యూస్:
నల్లపురెడ్డిపల్లె ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో జిల్లా ఉప వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఖాజా మొద్దీన్ సూపర్ వైజర్ లకు సిజనల్ వ్యాదుల గురించి అవగాహనా మరియు రివ్యూ నిర్వహించి డాక్టర్ బాలాజీ కి తగు సూచనలు ఇవ్వడమైనది.
ఈ సందర్భంగా జిల్లా ఉప వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఖాజా మొద్దీన్ మాట్లాడుతూ..ఆరోగ్య కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు ప్రతి రోజు మీకు కేటాయించున గృహలలో ఫీవర్ సర్వే, లార్వా సర్వే నిర్వహించాలని,ఎవరికైనా జ్వరం ఉన్నట్లు అయితే వెంటనే రక్త పరీక్ష చెయ్యాలి అని, అనారోగ్యంతో ఎవ్వరైనా బాధపడుతున్నట్లు అయితే వెంటనే దగ్గరలోని ప్రభుత్వ హాస్పిటల్ మాత్రమే వెళ్లాలని, ప్రభుత్వ హాస్పిటల్ లో అన్ని రకాల వ్యాధులకు ఉచితంగా పరీక్షలు చేస్తారని ప్రజలకు తెలియజేయాలని,అలాగే మీ పరిధిలోని ప్రభుత్వ హాస్టల్ ను ప్రతి వారానికి ఒక సారి సందర్శించి విద్యార్థుల ఆరోగ్య సమాచారం తెలుసుకోవాలి అని ప్రస్తుతం వర్షాకాలం కాబట్టి దోమలు వృద్ధి చెందే అవకాశం ఎక్కువ కాబట్టి నీరు నిల్వలు లేకుండా చూసుకోవాలని, నీరు నిలిచి, దోమలు గ్రుడ్డు పెట్టె అవకాశం ఉంటుంది. కావున ప్రతి ఒక్కరు నీటి తోట్లు,నీటి డ్రమ్ములు,బానలు నీరు నింపుకొనే ఇతర పాత్రల మీద మూతలు ఉంచాలి అని, పనికిరాని ప్లాస్టిక్ సామానులు తాగి పడేసిన కొబ్బరి బొండాలు ఇంటి పరిసరాలకు దూరంగా ఉంచాలని ప్రజలకు ఫ్రైడే-డ్రైడే ప్రాముఖ్యత గురించి తెలియజేయాలని డాక్టర్ ఖాజా మొద్దీన్
అన్నారు. ఈ కార్యక్రమములో నల్లపురెడ్డిపల్లె వైద్యాధికారి డాక్టర్: బాలాజీ , సబ్ యూనిట్ అధికారి సిద్దయ్య, సూపర్ వైజర్ లు వైద్య సిబ్బంది పాల్గొన్నారు.



