నవ్యాంధ్రప్రదేశ్ ప్రైవేట్ మెడికల్ లాబరేటరీ ప్రొఫెషనల్ అసోసియేషన్ లోగో ఆవిష్కరణ

నవ్యాంధ్రప్రదేశ్ ప్రైవేట్ మెడికల్ లాబరేటరీ ప్రొఫెషనల్ అసోసియేషన్ లోగో ఆవిష్కరణ
మంగళగిరి ప్రతినిధి సెప్టెంబర్ 14 యువతరం న్యూస్:
నవ్యాంధ్రప్రదేశ్ ప్రైవేట్ మెడికల్ లాబరేటరీ ప్రొఫెషనల్ అసోసియేషన్ లోగోను సినీ ప్రముఖులు డాక్టర్ గౌతమ్ రాజు ఆదివారం మంగళగిరి పట్టణంలోని ఆర్ఆర్ కన్వెన్షన్ లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సంఘం తరఫున రాష్ట్రంలోని ప్రతి ల్యాబ్ సభ్యుడికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. అసోసియేషన్ అధ్యక్షులు తాడేకోరు శ్రీహరి బాబు మాట్లాడుతూ “మా అసోసియేషన్ ప్రధాన లక్ష్యం రాష్ట్రంలోని సుమారు 20 నుండి 25 వేల ప్రైవేట్ మెడికల్ లాబరేటరీలను ఒకే వేదికపైకి తీసుకురావడం. లాబ్ ఎస్టాబ్లిష్మెంట్ రిజిస్ట్రేషన్ చేయించడం, ప్రతి మూడు నెలలకు ఒకసారి టెక్నీషియన్లకు శిక్షణా సెమినార్లు నిర్వహించడం, యజమానులకు ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించడం, మారుమూల ప్రాంతాల ప్రజలకు తక్కువ ఖర్చుతో ఖచ్చితమైన వైద్య నిర్ధారణ పరీక్షలు అందించడం మా ప్రధాన ధ్యేయం” అని పేర్కొన్నారు.అలాగే కొన్ని కార్పొరేట్ కంపెనీలు ఆన్‌లైన్‌లో “299/399 ప్యాకేజీలు” పేరుతో చేస్తున్న మోసపూరిత ప్రకటనలు ప్రజల ఆరోగ్యాన్ని వ్యాపార సాధనంగా మార్చుకుంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలకు ఈ విషయంలో అవగాహన కల్పించడం, నిజమైన నాణ్యమైన నిర్ధారణ పరీక్షలు అందించడం తమ అసోసియేషన్ బాధ్యత అని తెలిపారు.రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్లను కోరుతూ—ప్రైవేట్ లాబరేటరీలను కూడా ఆరోగ్యశ్రీలో భాగస్వామ్యం కల్పిస్తే రాష్ట్రంలోని 20 వేల లాబరేటరీలు, వారి కుటుంబాలు జీవనోపాధి పొందే అవకాశం ఉంటుందని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో కొల్లి బ్రహ్మయ్య, అడ్వైజరీ కమిటీ చైర్మన్ ఆనం సంజీవరెడ్డి, అసోసియేషన్ జనరల్ సెక్రటరీ దుర్గాప్రసాద్, కోశాధికారి నారాయణరావు, రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్లు, జాయింట్ సెక్రటరీలు, జిల్లా, మండల స్థాయి అధ్యక్షులు, కార్యదర్శులు పాల్గొన్నారు.