ANDHRA PRADESHBREAKING NEWSOFFICIALSOCIAL SERVICESTATE NEWS
కాపు రిటైర్డ్ ఎంప్లాయిస్ సమావేశం

కాపు రిటైర్డ్ ఎంప్లాయిస్ సమావేశం
మంగళగిరి ప్రతినిధి సెప్టెంబర్ 14 యువతరం న్యూస్:
మంగళగిరి గణపతి నగర్ నోబుల్ పబ్లిక్ స్కూల్ ఆవరణలో ఆదివారం కాపు రిటైర్డ్ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ సమావేశం జరిగింది. సమావేశానికి అసోసియేషన్ అధ్యక్షులు తాటి కృష్ణారావు నాయుడు అధ్యక్షత వహించారు. అసోసియేషన్ లో రిటైర్డ్ ఎంప్లాయిస్ ఎదుర్కొంటున్న వివిధ సమస్యలపై చర్చించారు. ఈ సందర్భంగా సమావేశంలో నూతనంగా బాధ్యతలు చేపట్టిన పీఏసీఎస్ డైరెక్టర్ వాసా వేణు కుమార్, అసోసియేషన్ ప్రతినిధి డీ రామాంజనేయులు లను సత్కరించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ నాయకులు గుడిపాటి చిన్న తిరుపతి నాయుడు, తోట సాంబశివరావు, ఎం ఎస్ కె శ్రీధర్, గోవర్ధన్, హరినాథ్, గోవింద్, నారాయణ తదితరులు పాల్గొన్నారు.