ANDHRA PRADESHBREAKING NEWSOFFICIALSTATE NEWS

సమాచార శాఖ డీఐపిఆర్వో గా బాధ్యతలు స్వీకరించిన జె. మల్లికార్జునయ్య

సమాచార శాఖ డీఐపిఆర్వో గా బాధ్యతలు స్వీకరించిన జె. మల్లికార్జునయ్య

నంద్యాల బ్యూరో సెప్టెంబర్ 14 యువతరం న్యూస్:

సమాచార పౌర సంబంధాల శాఖ జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి (డీఐపిఆర్వో)గా జె. మల్లికార్జునయ్య ఆదివారం పూర్తి అదనపు బాధ్యతలను స్వీకరించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అన్నమయ్య జిల్లాలో డిపిఆర్ఓ గా విధులు నిర్వహిస్తూ కర్నూలు సహాయ సంచాలకులుగా పదోన్నతి పొందడం జరిగింది. దీంతోపాటు నంద్యాల డిఐపిఆర్ఓగా పూర్తి అదనపు బాధ్యతలు స్వీకరించారు. నంద్యాల జిల్లాలో డీఐపిఆర్వోగా బాధ్యతలు తీసుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా  సలహాలు, సూచనలు పాటిస్తూ.. శాఖా పరంగా, జర్నలిస్టుల సంక్షేమానికి, ప్రభుత్వం అమలు చేస్తున్న అన్ని సంక్షేమ పథకాలు, అధికార కార్యక్రమాలను మీడియా ద్వారా మరింత విస్తృతం చేస్తామన్నారు. కార్యాలయంలో అందరూ బాధ్యతాయుతంగా కలిసికట్టుగా కర్తవ్య నిబద్ధతతో ఉద్యోగ ధర్మాన్ని నెరవేరుస్తూ జిల్లా అభివృద్ధిలో తమవంతు భాగస్వాములు కావాలని ఈ సందర్బంగా కోరారు.

ఈ సందర్భంగా కార్యాలయ సిబ్బంది నూతన డీఐపిఆర్వో జె.మల్లికార్జునయ్యకు శుభాకాంక్షలు తెలియజేశారు.

YUVATHARAM NEWS

Related Articles

Back to top button
error: Content is protected !!