ఏపీ స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ డైరెక్టర్ ఆరుద్ర భూలక్ష్మి కి సత్కారం

ఏపీ స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ డైరెక్టర్ ఆరుద్ర భూలక్ష్మి కి సత్కారం
మంగళగిరి ప్రతినిధి సెప్టెంబర్ 14 యువతరం న్యూస్:
ఏపీ స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ డైరెక్టర్ గా ఇటీవల నియమితులై బాధ్యతలు స్వీకరించిన ఆరుద్ర భూలక్ష్మి ని టీడీపీ నేతలు ఆదివారం ఆమె నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి శాలువా కప్పి పూల మాలలతో ఘనంగా సత్కరించారు.బీసీ సామాజికవర్గానికి చెందిన ఆరుద్ర భూలక్ష్మి కి ఏపీ స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ డైరెక్టర్ పదవి కేటాయించిన నియోజకవర్గ ఎమ్మెల్యే, రాష్ట్ర ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ కు టీడీపీ నేతలు ధన్యవాదాలు తెలిపారు. కురగల్లు గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు తోట శ్రీనివాస్ యాదవ్, తోట రమేష్, తోట బాజీ బాబు,కడియం దుర్గారావు, రుద్రశ్రీనివాసరావు,శాఖమూరు మాజీ సర్పంచ్ ఆరుద్ర సదాశివరావు, ఆరుద్ర శంకరరావు,పేరుబోయిన వెంకటేశ్వరావు తదితరులు ఏపీ స్వచ్ఛాంధ్ర కార్పోరేషన్ డైరెక్టర్ ఆరుద్ర భూలక్ష్మి ని కలిసి సత్కరించిన వారిలో ఉన్నారు.