శని, ఆది వారాల్లో కర్నూలు మార్కెట్ యార్డులో ఉల్లి బహిరంగ వేలం నిర్వహణ
జాయింట్ కలెక్టర్ డా. బి. నవ్య


శని, ఆది వారాల్లో కర్నూలు మార్కెట్ యార్డులో ఉల్లి బహిరంగ వేలం నిర్వహణ
రిటైలర్స్, హోల్సేలర్స్, హోటల్స్, హాస్టల్స్, ఇతర ఏజెన్సీలు, ఆసక్తి ఉన్న వారు బహిరంగ వేలంలో పాల్గొనవచ్చు
జాయింట్ కలెక్టర్ డా. బి. నవ్య
కర్నూలు కలెక్టరేట్ సెప్టెంబర్ 13 యువతరం న్యూస్:
కర్నూలు మార్కెట్ యార్డులో శని, ఆది వారాల్లో (ఈ నెల 13,14 తేదీల్లో) ఉల్లి బహిరంగ వేలం నిర్వహించనున్నామని, ఈ వేలంలో రిటైలర్స్, హోల్సేలర్స్, హోటల్స్, హాస్టల్స్, ఇతర ఏజెన్సీలు, ఆసక్తి ఉన్న వారు పాల్గొనవచ్చని జాయింట్ కలెక్టర్ డా. బి. నవ్య ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ నెల 13,14 తేదీల్లో కర్నూలు మార్కెట్ యార్డ్ కు సెలవు ప్రకటించినందున, రైతుల నుంచి మార్క్ ఫెడ్ కొనుగోలు చేసిన 2800 టన్నుల ఉల్లిని బహిరంగం వేలం వేసే కార్యక్రమాన్ని చేపడుతున్నామని జాయింట్ కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమం 13, 14 తేదీల్లో ఉదయం 10 గంటలకు నిర్వహించబడుతుందని, రిటైలర్స్, హోల్సేలర్స్, హోటల్స్, హాస్టల్స్, కూరగాయల ఏజెన్సీలు, ఆసక్తి ఉన్నవారు ఎవరైనా ఈ బహిరంగ వేలంలో పాల్గొనాలని జాయింట్ కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.



