ANDHRA PRADESHBREAKING NEWSOFFICIAL
రాజీమార్గం ద్వారా కేసులు సత్వర పరిష్కారం జాతీయ లోక్ అదాలత్ లో 643 కేసులు పరిష్కారం

రాజీమార్గం ద్వారా కేసులు సత్వర పరిష్కారం
జాతీయ లోక్ అదాలత్ లో 643 కేసులు పరిష్కారం
రేపల్లె సెప్టెంబర్ 13 యువతరం న్యూస్:
రాజీ మార్గం ద్వారా కేసులు సత్వర పరిష్కారంతోపాటు కక్షిదారులకు బహుళ ప్రయోజనాలు ఉంటాయని మండల న్యాయ సేవ అధికార సంస్థ చైర్మన్, సీనియర్ సివిల్ జడ్జి ఎస్ పి డి వెన్నెల పేర్కొన్నారు. రేపల్లె కోర్టులో శనివారం జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. ఈ సందర్భంగా సివిల్ 44, క్రిమినల్ 599 మొత్తం 643 కేసులు పరిష్కరించగా కక్షిదారులకు రూ. 1.13కోట్లు ప్రయోజనం కలిగిందని న్యాయమూర్తి వెన్నెల తెలిపారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ జూనియర్ సివిల్ జడ్జి సాయి దివ్య శ్రీ వాణి, న్యాయవాదులు లోక్ అదాలత్ సభ్యులు
డిఎస్ హరికుమార్,
యు శ్రీనివాసరావు, కక్షిదారులు కోర్టు పోలీస్ సిబ్బంది ఆయా బ్యాంకుల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.