ఆంధ్ర ప్రదేశ్ రెవిన్యూ సర్వీసెస్ అసోసియేషన్ రేపల్లె రెవిన్యూ డివిజన్ నూతన కమిటీ

ఆంధ్ర ప్రదేశ్ రెవిన్యూ సర్వీసెస్ అసోసియేషన్ రేపల్లె రెవిన్యూ డివిజన్ నూతన కమిటీ
రేపల్లె సెప్టెంబర్ 13 యువతరం న్యూస్:
ఆంధ్ర ప్రదేశ్ రెవిన్యూ సర్వీసెస్ అసోసియేషన్ (ఏపీ ఆర్ ఎస్ ఏ), రేపల్లె రెవిన్యూ డివిజన్ యూనిట్ ఎన్నికలు స్థానిక తహసీల్దార్ వారి కార్యాలయంలో శనివారం ప్రశాంతంగా జరిగాయి. ఈ ఎన్నికలకు పిట్టలవాణిపాలెం తహసీల్దార్ డి .వెంకటేశ్వరరావు ఎన్నికల అధికారిగా, శ్రీ.కె. శ్రీనివాసరావు సహాయ ఎన్నికల అధికారిగా వ్యవహరించారు. సంఘం నియమనిబంధనలు మేరకు రేపల్లె రెవిన్యూ డివిజన్ యూనిట్ ఎన్నికలు నిర్వహించారు. రేపల్లె రెవిన్యూ డివిజన్ యూనిట్ రెవిన్యూ అసోసియేషన్ ఎంపికైన కమిటీలో అధ్యక్షులుగా కె.నెహ్రుబాబు, తహసీల్దార్, సహాధ్యక్షులు కె .వెంకటేశ్వరరావు,
ఉపాధ్యక్షులు ప్రసన్న, ఉపాధ్యక్షులు ఎం.ప్రసాద్, జి. అన్నే , కార్యదర్శిగా టి. చంద్రశేఖర్,
జాయింట్ సెక్రటరీ యస్వంత్ కింగ్స్, జాయింట్ సెక్రటరీలుగా ఏ. లోకనాధ్ హరికృష్ణ, షేక్ జాహిరా భాను,
కోశాధికారిగా పి.విజేంద్ర రావు,
ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ కె. రవికుమార్, ఎం. శరత్ బాబు,
ఎం. సాయి వెంకట్, టైపిస్ట్
జిల్లా కౌన్సిల్- ఎన్.సత్యనారాయణ, యస్. శ్రీనివాసరావు(డిటి)
ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. వారితో ఎన్నికల అధికారి సంఘ బైలా ప్రకారం ప్రమాణం చేయించి వారికీ ఎన్నిక ధ్రువీకరణ పత్రాలు అందచేసారు. ఎన్నికైన కమిటీ సభ్యులు అందరిని బాపట్ల జిల్లా అధ్యక్షులు సి.హెచ్. సురేష్ బాబు శుభాకాంక్షలు తెలిపి రెవిన్యూ ఉద్యోగుల సంక్షేమం కొరకు కృషి చేయాలని కోరారు. అనంతరం నూతన కమిటీ సభ్యులను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి బి. ఓంకార్, జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎం సత్యనారాయణ, జిల్లా ఉపాధ్యక్షులు ఎం వెంకటేశ్వరరావు, జిల్లా కమిటీ సభ్యులు టి నిరంజన్ మరియు జిల్లా కమిటీ సభ్యులు, విఆర్ఓ, వీఆర్ఏ లు, తదితరులు పాల్గొన్నారు.