సీఎం చంద్రబాబు నాయుడు తోనే రాష్ట్రం సంపూర్ణ అభివృద్ధి

సీఎం చంద్రబాబు నాయుడు తోనే రాష్ట్రం సంపూర్ణ అభివృద్ధి
అశోక శిలా శాసనాలను పర్యాటక కేంద్రంగా మారుస్తాం
ఎమ్మెల్యే కేఈ శ్యాం కుమార్
పత్తికొండ సెప్టెంబర్ 6 యువతరం న్యూస్:
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తోనే రాష్ట్రం సంపూర్ణ అభివృద్ధి చెందుతుందని ఎమ్మెల్యే కెఈ శ్యామ్ కుమార్ పేర్కొన్నారు. పత్తికొండ మండలం దేవకుంట గ్రామం 70 లక్షలు, తుగ్గలి మండలంలోని జొన్నగిరి గ్రామ సమీపంలోనే దక్షిణ భారతదేశంలో ప్రఖ్యాతిగాంచిన అశోక్ శిలా శాసనాలకు రూ 90 లక్షల తో నిర్మించిన సిసి రోడ్డు ను శుక్రవారం ఎమ్మెల్యే కెఈ శ్యాం కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా టిడిపి నాయకులు, అధికారులు ఎమ్మెల్యే కెఈ శ్యామ్ కుమార్ కు మేళ తాళాలు ,డ్రమ్స్ వాయిద్యాల మధ్య ఘన స్వాగతం పలికి శాలువా పూలమాలతో ఘనంగా సత్కరించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే కెఈ శ్యామ్ కుమార్ మాట్లాడుతూ దక్షిణ భారతదేశంలో ఎంతో ప్రఖ్యాతగాంచిన అశోక్ శిలా శాసనాలను సందర్శించేందుకు వచ్చే పర్యాటకులకు సౌకర్యం కల్పించేందుకు రూ 90 లక్షలతో సిమెంట్ రోడ్డు వేయించడం జరిగిందన్నారు. దక్షిణ భారతదేశంలో అశోక శిలాశాసనాలు ఎంతో చరిత్రత్మక శాసనాలు అని, ఇక్కడికి వచ్చే పర్యాటకులకు అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామని అలాగే దేవకుంట కు 70 లక్షల రూపాయల తో cc రోడ్ వేయించడం జరిగింది అని అన్నారు.ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు,నాయకులు మండల తదితరులు పాల్గొన్నారు.