జల్ జీవన్ మిషన్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలి

జల్ జీవన్ మిషన్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలి
జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా
కర్నూలు కలెక్టరేట్ సెప్టెంబర్ 03 యువతరం న్యూస్:
జల్ జీవన్ మిషన్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా ఆర్డబ్ల్యూఎస్ అధికారులను ఆదేశించారు. బుధవారం ఢిల్లీ నుండి జల్ జీవన్ మిషన్ అమలు పై అదనపు కార్యదర్శి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్ లకు పలు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా జిల్లాలో జల్ జీవన్ మిషన్ పథకం కింద ఇంటింటి కుళాయి కనెక్షన్లు 64 శాతం పూర్తి చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ జల్ జీవన్ మిషన్ అదనపు కార్యదర్శి కి వివరించారు.
అనంతరం జిల్లా కలెక్టర్ అధికారులతో మాట్లాడుతూ జిల్లాలో గ్రామీణ ప్రాంతాల్లో నీటి సమస్య లేకుండా చూడాలని, ఎక్కడైనా సమస్య వస్తే వెంటనే స్పందించి పరిష్కరించాలన్నారు. కుళాయి కనెక్షన్ కార్యాచరణ, నీటి నాణ్యత పర్యవేక్షణను ఆర్ డబ్ల్యూ ఎస్ యాప్ ద్వారా, పి ఆర్ వన్ యాప్ ద్వారా పర్యవేక్షణ చేయాలని అందుకు సంబంధించిన నివేదికలు తనకు కూడా సమర్పించాలని కలెక్టర్ ఆర్ డబ్ల్యూ ఎస్ ఎస్ఈ ని ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్ లో ఆర్ డబ్ల్యూ ఎస్ ఎస్ఈ మనోహర్ తదితరులు పాల్గొన్నారు.