సెప్టెంబర్ 4 (గురువారం)న కర్నూలు లో 730 వినాయక విగ్రహాల నిమజ్జనం

సెప్టెంబర్ 4 (గురువారం)న కర్నూలు లో 730 వినాయక విగ్రహాల నిమజ్జనం
నిమజ్జనం రోజున నగరంలో ట్రాఫిక్ మళ్ళింపు
వినాయక నిమజ్జనంను ప్రశాంతవాతావరణంలో జరుపుకోవాలి
జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపియస్
నిమజ్జనానికి 1,858 మంది పోలీసులతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు
భారీ సంఖ్యలో పోలీసు బలగాల మోహరింపు
సాంకేతి పరిజ్ఞానాన్ని పూర్తిస్ధాయిలో వినియోగిస్తున్నాం
నిమజ్జనం అంతా డ్రోన్, సిసికెమెరాలు, విడియో కెమెరాలతో చిత్రికీరణ
ప్రశాంతంగా కొనసాగేలా భద్రతా చర్యలు చేపట్టాం
ప్రజలు, మతపెద్దలు, రాజకీయ పార్టీలు, యువత, మీడియా జిల్లా పోలీసులకు సహాకరించాలి
కర్నూలు క్రైమ్ సెప్టెంబర్ 3 యువతరం న్యూస్:
కర్నూలులో 730 గణేష్ విగ్రహాల నిమజ్జనం సంధర్భంగా (గురువారం) సెప్టెంబర్ 4 న జిల్లా పోలీసుశాఖ కట్టుదిట్టమైన భారీ భద్రతా చర్యలు చేపట్టిందని, ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకునేందుకు అవసరమైన అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నట్లు కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ మంగళవారం తెలిపారు.
బందోబస్తు విధులలో అడిషనల్ ఎస్పీలు, 12 మంది డిఎస్పీలు, 72 మంది సిఐలు మరియు ఆర్ ఐలు , 146 మంది ఎస్సైలు, 412 మంది ఎఎస్సై మరియు హెడ్ కానిస్టేబుల్స్ , 718 మంది పోలీసు కానిస్టేబుల్స్ , 14 ఎఆర్ సెక్షన్లు, 34 మంది మహిళా పోలీసులు, 17 స్పెషల్ పార్టీ పోలీసులు, 459 మంది హోంగార్డులను మొత్తం 1,858 పోలీసులను మోహరింపజేశామన్నారు.
ఎవరికీ అసౌకర్యం కలగకుండా, ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా నిమజ్జన ప్రక్రియ సంతోషంగా జరుపుకోవాలని జిల్లా ఎస్పీ జిల్లా ప్రజలకు , గణేష్ ఉత్సవ విగ్రహా నిర్వహకులకు ఈ క్రింది సూచనలు, సలహాలు తెలియజేశారు. విగ్రహాల నిర్వహకులు సమయపాలన పాటిస్తూ విగ్రహాల ఊరేగింపుకు అవసరమైన వాహానాలను, క్రేన్ల ను సిధ్దంగా ఉంచుకోవాలన్నారు. విగ్రహాల ఊరేగింపు వాహనాల పై చిన్నపిల్లలు ఉండకుండా ప్రమాదాల బారిన పడకుండా చూసుకోవాలన్నారు. నిమజ్జన సమయంలో కెసి కెనాల్ ఘాట్లు, కాలువలకు పిల్లలు, మహిళలను దూరంగా ఉంచాలన్నారు. ఊరేగింపులో వినాయక విగ్రహాలు తరలించే సమయంలో కరెంటు తీగలు తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
ఇతరుల మనోభావాలను గౌరవించాలన్నారు.
అల్లరి మూకల పై గట్టి నిఘా ఏర్పాటు చేశామన్నారు.
బాంబు డిస్పోజబుల్, డాగ్ స్క్వాడ్ బృందాలతో విస్తృత తనిఖీలు చేస్తున్నామన్నారు.
అనుమానిత వస్తువులు గాని, వ్యక్తులు గాని తారసపడితే డయల్ 100 లేదా డయల్ 112 కు గాని, స్ధానిక పోలీసులకు గాని ప్రజలు సమాచారం అందించాలన్నారు.
నిమజ్జనం సంధర్బంగా కర్నూలు నగరంలో ట్రాఫిక్ మళ్ళింపు.
వాహనచోదకులు, ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించి పోలీసులకు సహాకరించాలి. గణేష్ నిమజ్జనం సంధర్బంగా సెప్టెంబర్ 4 వ తేది గురువారం ఉదయం 10 గంటల నుంచి గణేష్ నిమజ్జన కార్యక్రమం పూర్తయ్యే వరకు నగరంలో ట్రాఫిక్ ను మళ్లించినట్లు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ తెలిపారు.
అత్యవసర ( 108, ఫైర్ , అంబులెన్సులు, పోలీసు వాహనాలు) సేవల కోసం పోలీసు వారితో అనుమతి పొందిన వాహనాలు మాత్రమే నిమజ్జన మార్గంలో అనుమతిస్తారు.
1) కర్నూలు ఆర్టీసి బస్టాండ్ నుండి రాజ్ విహార్ సెంటర్, గవర్నమెంట్ హాస్పిటల్, వినాయక్ ఘాట్, గాయత్రి ఎస్టేట్ వరకు ఎటువంటి వాహనాలకు అనుమతి ఉండదు. వాహనాల రాక, పోకల నిషేధం ఉంటుంది.
2) కర్నూలు ఆర్టీసి బస్టాండ్ నుండి ఆర్టీసి బస్సులు, ఇతర వాహనాలను బళ్ళారి చౌరస్తా మీదుగా కల్లూరు చెన్నమ్మ సర్కిల్, గుత్తి పెట్రోల్ బంక్ , బిర్లా జంక్షన్ , మద్దూర్ నగర్ సర్కిల్ , సి. క్యాంపు మీదుగా నంద్యాల చెక్ పోస్టు వైపు వాహనాల రాక, పోకలు ఉంటాయి.
3) ఆత్మకూరు, నంద్యాల, నందికోట్కూరు, నంద్యాల చెక్ పోస్టు వైపు నుండి నగరంలోనికి వచ్చే వాహనాలు సి. క్యాంపు, బిర్లాగేట్ , గుత్తి పెట్రోల్ బంక్ నుండి కల్లూరు చెన్నమ్మ సర్కిల్ , బళ్ళారి చౌరస్తా మీదుగా కర్నూలు ఆర్టిసి బస్టాండ్ కు చేరుకుంటాయి.
4) హైదరాబాద్, గద్వాల, అలంపూర్ నుండి వచ్చే వాహనాలు తుంగభద్ర బ్రిడ్జి , సంతోష్ నగర్, బళ్ళారి చౌరస్తా మీదుగా కర్నూలు ఆర్టిసి బస్టాండుకు చేరుకుంటాయి.
5) అనంతపురం, డోన్ నుండి వచ్చే వాహనాలు గుత్తి పెట్రోల్ బంకు, బళ్ళారి చౌరస్తా మీదుగా కర్నూలు ఆర్టిసి బస్టాండ్ చేరుకుంటాయి.
నిమజ్జనం పూర్తయిన తర్వాత నిమజ్జన వాహనాలు దేవనగర్ మీదుగా కృష్ణ నగర్ & కల్లూరు బ్రిడ్జి మీదుగా బయటకు వెళతాయి.
జిల్లా ప్రజలు, మతపెద్దలు, రాజకీయ పార్టీలు, యువత , మిడియా కర్నూలు నిమజ్జన ఉత్సవ కార్యక్రమం ప్రశాంతంగా జరిగేందుకు సహాయ సహాకారాలు అందించాలని జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ విజ్ఞప్తి చేశారు.