మత సామరస్యానికి ప్రతీక నంద్యాల జిల్లా

మత సామరస్యానికి ప్రతీక నంద్యాల జిల్లా
అన్ని వర్గాల ప్రజలు వినాయక నిమజ్జనంలో పాల్గొనడం ఎంతో శుభప్రదం
రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ ఎం డి ఫరూక్
ప్రజాప్రతినిధులు, అధికారులు సహకారంతో వినాయక నిమజ్జన కార్యక్రమం విజయవంతం
జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా
నంద్యాల బ్యూరో సెప్టెంబర్ 1 యువతరం న్యూస్:
మతసామరస్యానికి ప్రతీక నంద్యాల జిల్లా అని రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ పేర్కొన్నారు.
ఆదివారం నంద్యాల పట్టణ పరిసర ప్రాంతంలోని చిన్న చెరువులో కలెక్టరేట్ పరిపాలన గణపతి నిమర్జనం కార్యక్రమంలో రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ ఎం డి ఫరూక్, జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా, ఎస్పీ అది రాజ్ సింగ్ రాణా లు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ ఎం డి ఫరూక్ మాట్లాడుతూ…. నంద్యాల జిల్లా మత సామరస్యానికి ప్రతీక లాంటిదని గణేష్ నిమజ్జన కార్యక్రమంలో అన్ని వర్గాల ప్రజలు కలిసి నిమజ్జనంలో పాల్గొనడం ఎంతో శుభప్రదం అన్నారు. నంద్యాల పట్టణంలో ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించిన ఒకరికొకరు సోదర భావంతో కలిసిమెలిసి జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుందన్నారు. భవిష్యత్తులో ఇలాంటి మంచి కార్యక్రమాలు ప్రజలందరూ కలిసి మెలిసి సుఖసంతోషాలతో జరుపుకోవాలని మంత్రి ఆకాంక్షించారు.
అనంతరం జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా మాట్లాడుతూ… నంద్యాల జిల్లాలో అన్ని మతాలవారు కలిసిమెలిసి అన్ని పూజా కార్యక్రమాలలో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. వినాయక నిమజ్జన కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని ప్రశాంత వాతావరణంలో నిమజ్జన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగిందన్నారు. రాబోయే రోజులలో ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలలో ప్రతి ఒక్కరూ పాల్గొని మరింత ఘనంగా నిర్వహించాలన్నారు. చిన్న చెరువు నందు నేడు ఐదవ రోజు సుమారు 600 విగ్రహాలు నిమజ్జనం చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్, రెవెన్యూ యంత్రాంగం గట్టి పగడ్బందీ చర్యలు చేపట్టడం జరిగిందన్నారు. జిల్లాలోని ప్రజా ప్రతినిధులు ప్రజలు ప్రతి ఒక్కరు సహకారంతో వినాయక నిమజ్జన కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడం జరిగిందన్నారు. నిమజ్జన కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి జిల్లా కలెక్టర్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
జిల్లా ఎస్పీ ఆదిరాజ్ సింగ్ రాణా మాట్లాడుతూ…. జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో వినాయక చవితి పండుగను అత్యంత ఘనంగా నిర్వహించడం జరిగిందన్నారు. నేడు నిమజ్జనా కార్యక్రమానికి చిన్న చెరువు ప్రాంతంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి నిమజ్జన కార్యక్రమాలు పూర్తిచేయడం జరుగుతుందన్నారు.
రాత్రి సమయంలో విద్యుత్ అంతరాయం తెలవకుండా తగు చర్యలు చేపట్టడం జరిగిందన్నారు.