కర్నూల్ అసెంబ్లీ నియోజకవర్గం ఇన్చార్జిగా ఎస్వి మోహన్ రెడ్డి

కర్నూల్ అసెంబ్లీ నియోజకవర్గం ఇన్చార్జిగా ఎస్ వి మోహన్ రెడ్డి
కర్నూల్ ప్రతినిధి ఆగస్టు 31 యువతరం న్యూస్:
కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గం ఇన్చార్జిగా కర్నూలు మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి ప్రకటించడంపై కర్నూల్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. కర్నూలు కొండారెడ్డి బురుజు పై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను మరోసారి ఎగరేసేందుకు తాము కృషి చేస్తామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు జిల్లా ప్రధాన కార్యదర్శి షరీఫ్ అన్నారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆశయాలకు అనుగుణంగా కర్నూలు లో అన్ని వర్గాలను కలుపుకుని పార్టీ బలోపేతానికి కృషి తోపాటు ప్రజల కోసం పోరాటం చేస్తామని తెలిపారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో రానున్న కార్పోరేషన్ ఎన్నికల తోపాటు ఏడు నియోజకవర్గాల్లో పార్టీ విజయానికి పాటు పోరాడుతామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి అనుబంధ విభాగాల అధ్యక్షులు ఎస్ షరీఫ్, అక్కిమి హనుమంత్ రెడ్డి , పటేల్ హనుమంతు రెడ్డి , కిషన్, రాఘవేంద్ర నాయుడు, లాజర్, గోల్డ్ శీను, బుల్లెట్ అంజి, సలీం భాయ్, ఫిరోజ్, బబ్లూ, రవి, కంటూ, పరశురాం, యేసు, శివ, వస్తాద్ తదితరులు పాల్గొన్నారు.