విశాఖలో ఈగల్ టీం డ్రగ్స్ అవగాహన సదస్సు

విశాఖలో ఈగల్ టీం డ్రగ్స్ అవగాహన సదస్సు
ఉత్తరాంధ్ర ప్రతినిధి ఆగస్టు 29
యువతరం న్యూస్:
ఈగల్ ఐజి ఆకే రవి కృష్ణ ఆదేశాల మేరకు ఈగల్ టీం టాస్క్‌ఫోర్స్ ల ఆధ్వర్యంలో, స్కిల్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియాలో డ్రగ్స్‌పై అవగాహన సదస్సు నిర్వహించబడింది
ఈ కార్యక్రమంలో ప్రధానంగా రాష్ట్రవ్యాప్తంగా గంజాయి నిర్మూలన కోసం ఈగల్ టీం చేపడుతున్న చర్యలను వివరించారు.
డ్రగ్స్‌కు బానిసలు కావడం వలన కలిగే ఆరోగ్య, ఆర్థిక, విద్యా, సామాజిక సమస్యలను విద్యార్థులకు తెలియజేశారు.
ఎన్ డి పి ఎస్ చట్టం కింద డ్రగ్స్ కేసుల్లో పడితే ఎదుర్కొవాల్సిన శిక్షలు, జరిమానాలపై అవగాహన కల్పించారు.
శిక్షణ పొందుతున్న విద్యార్థులకు పి ఐ టి, ఎన్ డి పి ఎస్, ఫోక్షో చట్టం గురించి వివరించారు.
డ్రగ్స్ రహిత సమాజం కోసం విద్యార్థులందరూ ప్రతిజ్ఞ చేశారు.
సహాయంకోసం 1972 టోల్‌ఫ్రీ నంబర్, 8977781972 వాట్సాప్ నంబర్ వివరాలు అందించారు.
పాఠశాలలు, కళాశాలల్లో ఈగల్ క్లబ్‌ల ఏర్పాటుకు సంబంధించిన ప్రణాళికలపై చర్చించారు.
డ్రగ్స్ కేసుల్లో నేరస్తుల ఆస్తులను కూడా ప్రభుత్వం జప్తు చేస్తుందని స్పష్టం చేశారు.
ఈ అవగాహన కార్యక్రమంలో సుమారు 1000 మంది విద్యార్థులు పాల్గొన్నారు.
ఈగల్ టీం ఇన్స్పెక్టర్ డా.టి.కళ్యాణి, టి.ధనుంజయ నాయుడు, స్కిల్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా ఇన్‌చార్జ్, సిబ్బంది పాల్గొని విద్యార్థులకు ఉపయోగకరమైన సూచనలు అందించారు.