ఎమ్మెల్యే కూన రవికుమార్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన నాయకులు

ఎమ్మెల్యే కూన రవికుమార్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన నాయకులు
ఉత్తరాంధ్ర ప్రతినిధి ఆగస్టు 24
యువతరం న్యూస్:
ఆమదాలవలస ఎమ్మెల్యే, యుపిఎస్ చైర్మన్ కూన రవికుమార్‌ను డిడిపి విశాఖ పార్లమెంట్ అధికారి ప్రతినిధి సనపల వరప్రసాద్, బిజెపి పార్లమెంటరీ జనరల్ సెక్రటరీ సనపల రామకృష్ణ, సీనియర్ న్యాయవాది నరసింహస్వామి, బిల్డర్ పొన్నాడ రాంబాబు ఆదివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు పుష్పగుచ్ఛం అందజేసి, దుశ్శాలవతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమం ఆత్మీయ వాతావరణంలో సాగింది.
ఈ సందర్భంగా నరసింహస్వామి, రామకృష్ణ మాట్లాడుతూ ఎమ్మెల్యే కూన రవికుమార్ ఎల్లప్పుడూ ప్రజలతో ఉండి అందరికీ అందుబాటులో ఉంటారని, స్థానిక అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంలో ముందుండే నాయకుడని పేర్కొన్నారు.
సనపల వరప్రసాద్ మాట్లాడుతూ “కూన రవికుమార్ ప్రజల సమస్యలను వినడంలో, పరిష్కరించడంలో ఎప్పుడూ కృషి చేస్తున్నారు. ఆయన చేస్తున్న సేవలు ప్రశంసనీయమైనవి. భవిష్యత్తులో మరిన్ని ఉన్నతమైన పదవులు చేపట్టాలని మా ఆకాంక్ష,” అని తెలిపారు.
ఎమ్మెల్యే రవికుమార్ ఈ ఆత్మీయ కలయికకు కృతజ్ఞతలు తెలిపారు.