స్వమిత్వ సర్వే కార్యక్రమాన్ని వేగవంతం చేయాలి
నంద్యాల జిల్లా జాయింట్ కలెక్టర్ సి. విష్ణు చరణ్

స్వమిత్వ సర్వే కార్యక్రమాన్ని వేగవంతం చేయాలి
జిల్లా జాయింట్ కలెక్టర్ సి. విష్ణు చరణ్
పాణ్యం ఆగస్టు 23 యువతరం న్యూస్:
జిల్లాలో జరుగుతున్న స్వమిత్వ సర్వే కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ సి. విష్ణు చరణ్ సంబంధిత అధికారులకు సూచించారు.
శుక్రవారం జిల్లా జాయింట్ కలెక్టర్ సి విష్ణు చరణ్ పాణ్యం మండలం, భూపనపాడు గ్రామంలో జరుగుతున్న స్వమిత్వ సర్వే కార్యక్రమాన్ని పరిశీలించారు.
ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ సి.విష్ణు చరణ్ మాట్లాడుతూ…. రాష్ట్ర ప్రభుత్వం స్వమిత్వ సర్వే కార్యక్రమంపై ప్రత్యేక శ్రద్ధ చూపుతోందని ఈ సర్వే కార్యక్రమాన్ని సంబంధిత అధికారులు అందరూ సమన్వయంతో పనిచేసి ఈనెల 31వ తేదీ లోపల పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టాలన్నారు. పంచాయతీరాజ్ శాఖ ద్వారా సచివాలయంలోని ఇంజనీరింగ్ అసిస్టెంట్లు, డిజిటల్ అసిస్టెంట్లు, పంచాయతీ సెక్రటరీలు బృందాలుగా ఏర్పడి సర్వే చేపట్టడం జరుగుతుందన్నారు.
మన జిల్లాలో ఆగస్టు 1వ తేదీ నుంచి సర్వే జరుగుతోందని నంద్యాల జిల్లాలో 188 గ్రామాలలో స్వమిత్వ సర్వే చేపట్టడం జరుగుతుందన్నారు. ఇంకా సర్వే టీమ్స్ పెంచి ఆగస్టు 31వ తేదీ లోపల సర్వే పూర్తి చేయాలన్నారు. స్వమిత్వ సర్వే వల్ల ఎటువంటి ఎన్ క్రోచ్ మెంట్ సమస్యలు ఉండవని, ఎవరి ఆస్తి వారికే చెల్లెందుకు ఈ సర్వే ఉపయోగపడుతుందన్నారు. సర్వే పూర్తి అయిన తర్వాత ప్రతి ఒక్కరికి ప్రాపర్టీ సర్టిఫికెట్ ఇవ్వడం జరుగుతుందన్నారు. కావున ప్రతి ఒక్కరూ స్వమిత్వ సర్వే కార్యక్రమం పూర్తయ్యేందుకు సహకరించాలన్నారు.
ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ సర్వే మ్యాప్ ను పరిశీలించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి లలితా బాయి, ఎంపీడీవో, ఇంజనీరింగ్ అసిస్టెంట్లు, డిజిటల్ అసిస్టెంట్లు, పంచాయతీ సెక్రటరీలు తదితరులు పాల్గొన్నారు.