కర్నూలు జిల్లా కు దామోదరం సంజీవయ్య జిల్లాగా పేరు పెట్టాలని సంతకాల సేకరణ

కర్నూలు జిల్లా కు దామోదరం సంజీవయ్య జిల్లాగా పేరు పెట్టాలని సంతకాల సేకరణ
కర్నూలు కలెక్టరేట్ ఆగష్టు 23 యువతరం న్యూస్:
కర్నూలు జిల్లాకు దామోదరం సంజీవయ్య జిల్లాగా పేరు పెట్టాలని దామోదరం సంజీవయ్య జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో సంతకాల సేకరణ చేశారు. కర్నూలు పాత బస్టాండ్ లోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఈ కార్యక్రమాన్ని వారు నిర్వహించారు. దేశస్థాయిలో కర్నూలు జిల్లాకు పేరు తీసుకొని వచ్చిన దామోదర్ సంజీవయ్యకు కర్నూలు జిల్లాకు పేరు పెట్టాలని బహుజన సంఘాల నాయకులు, మేధావులు, వివిధ రాజకీయ పార్టీ నాయకులు కోరారు. దామోదరం సంజీవయ్య ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేశారని వారు తెలిపారు. వృద్యాప పింఛను దేశంలో మొట్టమొదటిసారి ప్రారంభించింది. దామోదరం సంజీవయ్య ని వారు గుర్తు చేశారు. కార్మికులకు బోనస్ దేశంలోనే మొదటిసారి ప్రారంభించింది సైతం దామోదర్ సంజీవయ్య అని తెలిపారు. కర్నూలుకు వెంటనే దామోదరం సంజీవయ్య పేరు పెట్టాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో నక్కలమిట్ట శ్రీనివాసులు, దామోదరం రాధాకృష్ణ, జె.వి కృష్ణయ్య, రంగస్వామి, రామ శేషయ్య తదితరులు పాల్గొన్నారు.