ANDHRA PRADESHOFFICIAL

వివిధ శాఖల అభివృద్ధికి సంబంధించిన కీ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ లక్ష్యాలను సాధించాలి

కర్నూలు జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా

వివిధ శాఖల అభివృద్ధికి సంబంధించిన కీ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ లక్ష్యాలను సాధించాలి

జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా

కర్నూలు కలెక్టరేట్ ఆగస్టు 23 యువతరం న్యూస్:

వివిధ శాఖల అభివృద్ధికి సంబంధించిన కీ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ లక్ష్యాలను సాధించాలని జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా అధికారులను ఆదేశించారు.
శుక్రవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్ లో 2025-26 ఆర్థిక సంవత్సరం కు సంబంధించి వివిధ శాఖల కు నిర్దేశించిన కీ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్ ల పై జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఈ ఆర్థిక సంవత్సరంలో ఆ యా శాఖల్లో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల కీ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్ల ఆధారంగానే కలెక్టర్ల కాన్ఫరెన్స్, జిల్లా స్థాయి సమీక్ష, మండల స్థాయి సమీక్షలు ఉంటాయన్నారు. ఆయా శాఖల హెడ్ ఆఫీస్ నుండి కీ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ ను జిల్లా లక్ష్యాలను కేటాయించారన్నారు. ఈ లక్ష్యాలను మండలాలకు కూడా విభజించి వాటిని సాధించే దిశగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆయా శాఖల జిల్లా అధికారులను ఆదేశించారు.. అదే విధంగా 2023- 24, 2024-25 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి సాధించిన లక్ష్యాల వివరాలను కూడా పొందుపరచాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ, హార్టికల్చర్, ఏపీ ఎంఐపీ, హార్టికల్చర్ కీ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ లక్ష్యాలపై కలెక్టర్ సమీక్షించారు. అన్ని శాఖలు మండలాల వారీగా లక్ష్యాలు కేటాయించి, నివేదికను అందచేసి ఆమోదం పొందాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
సమావేశంలో డిఆర్ఓ సి.వెంకట నారాయణమ్మ, సిపిఓ హిమా ప్రభాకర్ రాజు, జిల్లా పరిషత్ సీఈఓ నాసర రెడ్డి, హౌసింగ్ పీడీ చిరంజీవి, డ్వామా పిడి వెంకటరమణయ్య, జిల్లా వ్యవసాయ అధికారి వరలక్ష్మి, ఉద్యాన శాఖ అధికారి రామాంజనేయులు, తదితరులు పాల్గొన్నారు.

YUVATHARAM NEWS

Related Articles

Back to top button
error: Content is protected !!