సివిల్, ఎపిఎస్పీ కానిస్టేబుళ్ళుగా ఎంపికైన అభ్యర్ధులు ఆగస్టు 25, 26 తేదిలలో ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరు కావాలి
కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్

సివిల్(సివిల్ ), ఎపిఎస్పీ (ఎపిఎస్పి) కానిస్టేబుళ్ళుగా ఎంపికైన అభ్యర్ధులు ఆగస్టు 25, 26 తేదిలలో ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరు కావాలి
కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపియస్
కర్నూలు క్రైమ్ ఆగస్టు 23 యువతరం న్యూస్:
కర్నూలు జిల్లా ఎపిఎస్పీ 2 వ బెటాలియన్ పోలీసు పెరేడ్ గ్రౌండ్లో ఎస్ సి టి కానిస్టేబుళ్ళ ఉద్యోగాల ఎంపిక ప్రక్రియకు హాజరై, ఎస్ సి టి సివిల్, ఎపిఎస్పీ ఉద్యోగాలకు ఎంపికైన పురుష, స్త్రీ అభ్యర్థులు ఆగష్టు 25, 26 తేదిలలో కర్నూలు జిల్లా పోలీసు(కొండారెడ్డి బురుజు దగ్గర) కార్యాలయం లో ఉదయం 10 గంటలకు హాజరుకావాలని కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ శుక్ర వారం ఒక ప్రకటనలో తెలిపారు.
అభ్యర్ధులు సెలక్షన్ ప్రక్రియలో అప్పుడు అప్లికేషన్ తో జతపర్చిన అన్ని ధృవ పత్రాల ఒరిజినల్ సర్టిఫికేట్స్, అన్నీక్సురి – I ( రివైస్డ్ అట్టేశాషన్ ఫారం ) గెజిటెడ్ అధికారితో అటెస్టేషన్ చేయించిన 3 సెట్ల జిరాక్స్ కాపీలను, 4 పాస్పోర్టు సైజ్ కలర్ ఫోటోలను తీసుకుని రావాలని జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ తెలిపారు.