ANDHRA PRADESHOFFICIALSTATE NEWS

పారిశ్రామిక రంగంలో గణనీయమైన ప్రగతి సాధించిన జిల్లా

కర్నూలు జిల్లా కలెక్టర్ పి.రంజిత్ భాష

 

పారిశ్రామిక రంగంలో గణనీయమైన ప్రగతి సాధించిన జిల్లా

జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా

కర్నూలు కలెక్టరేట్ ఆగస్టు 23 యువతరం న్యూస్:

జిల్లా పారిశ్రామికంగా గణనీయమైన ప్రగతి సాధిస్తోందని జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా పేర్కొన్నారు. శుక్రవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్ లో జిల్లా పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో బిజినెస్ రిఫార్మ్స్ యాక్షన్ ప్లాన్ -2024 కు సంబంధించి పరిశ్రమల యాజమాన్యాల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పారిశ్రామికాభివృద్ధికి అనేక చర్యలు తీసుకుంటోందన్నారు. ఇందులో భాగంగా కర్నూలు జిల్లా ఓర్వకల్లు హబ్ లో 5 వేల ఎకరాల్లో జైరాజ్ ఇస్పాత్, రిలయన్స్, అగస్త్యా, డ్రోన్స్ హబ్ తదితర కంపెనీలను ఏర్పాటు చేయడం జరుగుతోందన్నారు. ఈ పరిశ్రమల ద్వారా వేల మందికి ఉపాధి కలుగుతుందన్నారు. పారిశ్రామిక హబ్ కు నీటి సరఫరా పనులు కూడా 80 శాతం పూర్తయ్యాయని, రోడ్లు ఇతర మౌలిక సదుపాయాలు కల్పించడం జరిగిందన్నారు. జిల్లా మంత్రి టి.జి.భరత్ పరిశ్రమల శాఖకు మంత్రిగా ఉన్నందున, వారి కృషి వల్ల కూడా జిల్లాలో పారిశ్రామికాభివృద్ధి సాధ్యమవుతోందని కలెక్టర్ తెలిపారు.. సింగిల్ డెస్క్ పోర్టల్ ద్వారా పరిశ్రమల స్థాపనకు వేగంగా అనుమతులు మంజూరు చేస్తున్నామన్నారు. రెవెన్యూ, ఎలక్ట్రికల్, బాయిలర్స్, పొల్యూషన్ కంట్రోల్, ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్, లేబర్, అగ్నిమాపక శాఖ తదితర 18 శాఖలకు సంబంధించి గడువు లోపు అనుమతులు మంజూరుచేస్తున్నామని తెలిపారు..రాష్ట్ర ప్రభుత్వం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో భాగంగా అనేక చర్యలు చేపట్టిందని కలెక్టర్ తెలిపారు. బిజినెస్ రీఫార్మ్ యాక్షన్ ప్లాన్ 20 24 కు సంబంధించి 435 రికమండేషన్స్ తో కేంద్ర ప్రభుత్వ సంస్థ డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఇండస్ట్రీ మరియు ఇంటర్నల్ ట్రేడ్( డిపి ఐఐటి) వారి ద్వారా ఫీడ్బ్యాక్ సర్వే నిర్వహిస్తోందని, రాష్ట్ర ప్రభుత్వ సేవలను పొందుతున్న పారిశ్రామిక సంస్థలు ఫోన్, ఐ వి ఆర్ ఎస్, వాట్సప్ తదితర పద్ధతుల ద్వారా అడిగే ప్రశ్నలకు తమ ఫీడ్ బ్యాక్ ను ఇవ్వాలని జిల్లా కలెక్టర్ కోరారు. సమావేశంలో జిఎం ఇండస్ట్రీస్ జవహర్ బాబు, డిప్యూటీ డైరెక్టర్ హరినాథ్ రెడ్డి (ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, విజయవాడ) ఆధ్వర్యంలో ప్రసంజిత్ దేబ్ కెపిఎంజి కన్సల్టెంట్ పరిశ్రమలు నెలకొల్పడానికి సింగిల్ డెస్క్ పోర్టల్ ను ఏ విధంగా వినియోగించుకోవాలి, ఈజ్ ఎఫ్ డూయింగ్ బిజినెస్ ఫీడ్బ్యాక్ ను ఏ విధంగా ఇవ్వాలి అన్న విషయాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా పారిశ్రామికవేత్తలకు వివరించారు. సమావేశంలో ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ నారాయణరెడ్డి, డిడి గ్రౌండ్ వాటర్ శ్రీనివాసులు, ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ విజయ్ కుమార్ రెడ్డి, జైరాజ్ ఇస్పాత్, జియో మైసూర్, రిలయన్స్, అగస్త్యా తదితర పారిశ్రామిక సంస్థల ప్రతినిధులు, పొల్యూషన్ కంట్రోల్, అగ్నిమాపక, రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు హాజరయ్యారు.

YUVATHARAM NEWS

Related Articles

Back to top button
error: Content is protected !!