ANDHRA PRADESHCRIME NEWSPOLITICS

బాధితురాలు కుటుంబాన్ని పరామర్శించిన బొమ్మన రమాకాంత్ రెడ్డి, టీ.బలరాం గౌడ్

బాధితురాలు కుటుంబాన్ని పరామర్శించిన బొమ్మన రమాకాంత్ రెడ్డి, టీ.బలరాం గౌడ్

వెల్దుర్తి ఆగస్టు 20 యువతరం న్యూస్:

మండల కేంద్రమైన వెల్దుర్తి పట్టణంలోని ఆరో వార్డు నందు సింగిల్ విండో చైర్మన్ బొమ్మన రమకాంత్ రెడ్డి, మండల కన్వీనర్ టి బలరాం గౌడ్ పర్యటించారు. ఆరో వార్డ్ నందు నిన్నటి దినం ఏకధాటిగా కురుస్తున్న వర్షాల కారణంగా పాడైపోయిన కరెంటు స్తంభం వలన ఒక మహిళకు విద్యుత్ షాక్ తగలడంతో, వారి కుటుంబాన్ని పరామర్శించి సదరు కరెంటు ఏఈ తో చరవాణిలో మాట్లాడి అక్కడున్న పాత కరెంటు స్తంభాలను తొలగించి కొత్త స్తంభాలను ఏర్పాటు చేసి సమస్యను పరిష్కరించాలని తెలిపారు. అలాగే ఆరో వార్డు నందు ఏడవ వార్డు నందు డ్రైనేజీ, అపరిశుభ్రంపై సంబంధిత గ్రామపంచాయతీ అధికారులతో మాట్లాడి పారిశుద్ధ్య పనులు చేపట్టాలని సూచించారు. అదేవిధంగా పలువురు కాలనీవాసులు సిసి రోడ్ల నిర్మాణము మరియు కాలువలు ఏర్పాటు చేయాలనికోరారు. పంచాయతీ తీర్మానాలు అయిన వెంటనే సీసీ రోడ్ల నిర్మాణాలు, కాలువలు చేపడతామని కాలనీ సులకు తెలిపారు.

YUVATHARAM NEWS

Related Articles

Back to top button
error: Content is protected !!