ANDHRA PRADESHDEVELOP
వెల్దుర్తి రాణి తోట 12వ వార్డులో సిసి రోడ్లు వేయిస్తా
మాజీ ఎంపీపీ తెదేపా నేత జ్ఞానేశ్వర్ గౌడ్

వెల్దుర్తి రాణి తోట 12వ వార్డులో సీసీ రోడ్డు వేయిస్తా
మాజీ ఎంపీపీ తెదేపా నేత జ్ఞానేశ్వర్ గౌడ్
వెల్దుర్తి ఆగస్టు 19 యువతరం న్యూస్:
మండల కేంద్రమైన వెల్దుర్తిలోని రాణి తోట 12 అవార్డులో సీసీ రోడ్లు వేయిస్తానని మాజీ ఎంపీపీ తెదేపా నేత జ్ఞానేశ్వర్ గౌడ్ ఆ వార్డు ప్రజలకు హామీ ఇచ్చారు. సోమవారం ఆయన 12వ వార్డులో పర్యటించారు. వార్డు పరిస్థితులను గమనించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన ప్రజలతో మాట్లాడుతూ పత్తికొండ నియోజకవర్గం ఎమ్మెల్యే కేఈ శ్యాం కుమార్ ఆదేశాల మేరకు వార్డులలో పర్యటించడం జరుగుతుందన్నారు. ఎమ్మెల్యే కేఈ శ్యాం కుమార్ ఆదేశాల మేరకు వెల్దుర్తి 12వ వార్డు రాణి తోటలో సీసీ రోడ్లు వేయడం జరుగుతుందన్నారు. మండల అభివృద్ధి ఎమ్మెల్యే కేఈ శ్యాం కుమార్ లక్ష్యం అని ఆయన పేర్కొన్నారు. వెల్దుర్తి పట్టణంలోని ప్రతి వార్డులో సిసి రోడ్లు వేయిస్తామని తెలిపారు.