శ్రీశైల క్షేత్ర ఆలయానికి భారీ సంఖ్యలో పెరిగిన భక్తుల రద్దీ

శ్రీశైల క్షేత్ర ఆలయానికి భారీ సంఖ్యలో పెరిగిన భక్తుల రద్దీ
శ్రీశైలం ప్రతినిధి ఆగస్టు 11 యువతరం న్యూస్:
ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలం నందు భారీగా పెరిగిన భక్తుల రద్దీ.
శ్రీశైలం ప్రాజెక్టు నుండి ఒక గేటు ద్వారా నాగార్జునసాగర్ కు నీటిని విడుదల చేయడం జరుగుతుంది.
ప్రకృతి అందాలను వీక్షించేందుకు అధిక సంఖ్యలో భక్తులు శ్రీశైలం ప్రాజెక్టుకు తరలివస్తున్నారు.
. ఆదివారం సెలవు రోజు కావడంతో మరియు శ్రావణ మాసం సందర్భంగా మల్లన్న ఆలయంలో భక్తుల రద్దీ.
. సుమారు గా శ్రీ స్వామివారి దర్శనానికి మూడు గంటల సమయం.
ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైల మహా క్షేత్రం జ్యోతిర్లింగ క్షేత్రంగా శ్రీశైల పుణ్యక్షేత్రం శ్రీశైలంలో ముక్కంటి మల్లన్న ఆలయానికి భక్తుల రద్దీ వరుసగా సెలవులు రావడం విద్యాసంస్థలు ప్రారంభం కావడంతో శ్రీ స్వామి అమ్మవార్లకు మొక్కులు తీర్చుకునేందుకు భక్తులు దర్శనానికి భారీగా తరలివచ్చారు. శ్రీశైల క్షేత్రం అంత భక్తజనంతో సందడి వాతావరణం నెలకొంది. భక్తులు తెల్లవారుజామున నుండి పాతాళ గంగలో పుణ్యస్నానాలు ఆచరించి శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శనార్థమై క్యూ లైన్ లో దర్శన కంపార్ట్మెంట్లలో బారులు తీరారు.
శ్రీ స్వామి అమ్మవార్ల దర్శనానికి భక్తులు సత్వర తగిన దర్శనం అయ్యే విధంగా అధికారులు ఏర్పాటు చేశారు. మరోపక్క భక్తుల రద్దీ దృశ్య శని ,ఆది, సోమవారాల లో ఆర్జిత అభిషేకాలు, కుంకుమార్చన నిలుపుదల చేశారు. సామాన్య భక్తులకు ఉచిత శీఘ్రదర్శనానికి భారీగా పెరిగిన భక్తులు రద్దీగా మరోపక్క ఆన్లైన్లో 500 /-రూపాయల స్పర్శ దర్శనానికి టికెట్ బుక్ చేసుకున్న వారికి మూడు విడుదలుగా ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మధ్యాహ్నం రెండు గంటల 30 నిమిషాలకు తిరిగి రాత్రి 9 గంటలకు స్పర్శ దర్శనానికి అనుమతిస్తున్న అధికారులు భక్తుల రద్దీ దృష్ట్యా క్యూలైన్లో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా శ్రీ స్వామి అమ్మవార్లను దర్శించుకునేలా ఆలయ కార్య నిర్వహణ అధికారి శ్రీనివాసరావు అధికారులకు ప్రత్యేక ఏర్పాట్లను ఏర్పాటు చేశారు. దర్శనార్థమైన భక్తులకు క్యూలైన్లు మరియు క్యూ కంపార్ట్మెంట్లలో ఉన్నటువంటి భక్తులకు ఎప్పటికప్పుడు పాలు అల్పాహారం బిస్కెట్లు మరియు మంచినీరు అందిస్తున్నారు. మరోపక్క తెలంగాణ ,ఆంధ్ర ప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా మహారాష్ట్ర ,కర్ణాటక ,తమిళనాడు ,కేరళ వంటి రాష్ట్రాల నుంచి భారీగా భక్తులు తరలివచ్చారు. ఆలయ కార్య నిర్వహణ అధికారి ఎం.శ్రీనివాసరావు సామాన్య భక్తులకు ఎటువంటి అంతరాయం లేకుండా సౌకర్యవంతమైన దర్శనం కోసం తగు ఏర్పాట్లను చేశారు.