కృపా కాలనీ, బుడగజంగం కాలనీ రోడ్లపై నిలిచిన వరద నీరు

కృపా కాలనీ, బుడగజంగం కాలనీ రోడ్లపై నిలిచిన వరద నీరు
ఈ వరద నీటి కష్టాలు తీరేదెప్పుడు…?
చెరువులను తలపిస్తున్న 48 వ డివిజన్
కడప ప్రతినిధి ఆగస్టు 11 యువతరం న్యూస్:
కడప నగరం 48 వ డివిజన్ పరిధిలో కృపా కాలనీ, బుడగజంగం కాలనీ, రామాంజనేయ పురం, పరమేశ్వర స్కూల్ వీధి, రామరాజుపల్లి, ఆచారి కాలనీ ప్రాంతాలు మౌలిక సదుపాయాలకు దూరంగా ఉన్నాయి. ప్రభుత్వాలు మారిన, పాలకులు మారిన ఇక్కడ కాయకష్టం చేసుకుని జీవించే నిరుపేద ప్రజల పరిస్థితి మారడం లేదు. ఇక్కడ చినుకు పడిందంటే చాలు చిత్తడితో ఈ చిన్నపాటి వర్షానికే చెరువు మయంగా మారాయి. ముఖ్యంగా ఈ ప్రాంతాలలో కొన్ని విధుల్లో రోడ్లు, డ్రైనేజీ కాలువలు లేకపోవడం ప్రధాన సమస్యగా మారింది. అదే విధంగా ఖాళీ స్థలాల్లో మురికి నీరు వరద నీరు నిల్వ వుండటం వల్ల స్థానికులు చాలా అవస్థలు పడుతున్నారు. విద్యార్థులు వృద్ధులు ఈ వరద నీటిలోనే నడవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్, కార్పొరేషన్ అధికారులు, పాలకులు స్పందించి ఈ ప్రాంతాలు పర్యటించి మౌనిక సదుపాయాలు కల్పించాలని స్థానికులు కోరుతున్నారు.