కర్నూలు సిటిలో బెస్త కమ్యూనిటీ ఉచిత వివాహ వేదిక

కర్నూలు సిటిలో బెస్త కమ్యూనిటీ ఉచిత వివాహ వేదిక
కర్నూలు క్రీడలు ఆగష్టు 11 యువతరం న్యూస్:
కర్నూల్ సిటీలో బెస్త కమ్యూనిటీ ఉచిత వివాహ పరిచయ వేదిక ఘనంగా
కర్నూల్ సిటీ బెస్త తెలుగు గంగపుత్ర సంక్షేమ సంఘం మరియు టిఎన్ఆర్ మాట్రిమోనీ .ఇన్ ఆధ్వర్యంలో, ఆదివారం జిల్లా పరిషత్ ఎంపీపీ హాల్ లో ఉచిత వివాహ పరిచయ వేదిక కార్యక్రమం విజయవంతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులుగా
రిటైర్డ్ తహసిల్దార్ జయన్న,బి. కృష్ణయ్య, నగర అధ్యక్షులు ఆనంద్ రాజ్, డి.ఎస్.పీ రామాంజనేయులు, డాక్టర్ కదిరి రమేష్,,
బీజేపీ నాయకులు, రంగస్వామి, వెంకటేశ్వర్లు, టి. నాగ రమణ హాజరై, వేదిక విజయవంతం కావడానికి తమ ప్రోత్సాహాన్ని అందించారు. కార్యక్రమంలో వధూవరుల తల్లిదండ్రులు హాజరై, ఫోటోలు మరియు బయోడేటాలను పరిశీలించి, తమకు నచ్చిన జంటలతో మాట్లాడుకునే అవకాశం పొందారు.
ఈ వేదిక ద్వారా అనేక కుటుంబాలు ఒకే చోట పరిచయం అవ్వడం, చర్చించుకోవడం సాధ్యమైందని నిర్వాహకులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వధూవరుల తల్లిదండ్రులు, సమాజ పెద్దలు అందరికీ వారు కృతజ్ఞతలు తెలిపారు.