ANDHRA PRADESHOFFICIAL
యువతరం ఎఫెక్ట్ : ముసలిమడుగు బీసీ కాలనీలో వెలుగులు

యువతరం ఎఫెక్ట్
ముసలిమడుగు బీసీ కాలనీలో వెలుగులు
కొత్తపల్లి ఆగస్టు 9 యువతరం న్యూస్:
ముసలిమడుగు బీసీ కాలనీలో గత రెండు నెలలుగా వీధి దీపాలు వెలగక కాలనీవాసులు పడుతున్నా ఇబ్బందుల శుక్రవారం యువతరం తెలుగు దినపత్రికలో ప్రచురితమైన ఎవరు పట్టించుకోరు… విధి దీపాలు వెలుగవు కథనానికి గ్రామ సర్పంచి జమిలాబీ, పంచాయతీ కార్యదర్శి అజ్మాతున్నిసా స్పందించి వీధి దీపాలు వెలిగేలా మరమ్మలు చేయించి, వెలిగేలా చర్యలు తీసుకున్నారు. దాంతో కాలనీవాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గ్రామ సచివాలయానికి లైన్మెన్ లేకపోవడంతోనే వీధి దీపాల పనుల్లో అలస్యమౌతుందని గ్రామ సచివాలయానికి లైన్మెన్ ను నియమించాలని గ్రామ సర్పంచి తెలిపారు.