వ్యభిచార ముఠా అరెస్ట్

వ్యభిచార ముఠా నిర్వాహకులు మరియు విటులు అరెస్టు
నాలుగో పట్టణ సీఐ. బి.వి. విక్రమసింహ
కర్నూలు క్రైమ్ ఆగస్టు 9 యువతరం న్యూస్:
కర్నూలు నాలుగో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో గత కొన్ని నెలలుగా గుట్టు మట్టు గా వ్యబిచారం జరుగుతుందన్న సమాచారం మేరకు, కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ మరియు కర్నూలు డీఎస్సీ ల ఆదేశాల మరకు నాలుగవ పట్టణ ఇన్పెక్టర్ విక్రమ సింహ, మరియు ఎస్సై చంద్ర శేఖర్ రెడ్డి, ఎస్ఐ మోహన్ కిశోరు రెడ్డి, మరియు తన సిబ్బందితో కర్నూలు నగరంలోని గుత్తి పెట్రోల్ సమీపంలో గల ఒక ఇంటి నందు రైడ్ చేయగా, అందులో అనుమానస్పదంగా కొందరు ఆడవాళ్లు, మగవాళ్లు ఉండడం గమనించి, విజయవాడ, అనంతపురం, నంద్యాల మరియు హైదరాబాద్ తదితర ప్రాంతాల నుంచి అమ్మాయిలకు మరియు స్త్రీ లకు మాయమాటలు చెప్పి, వారిని వ్యభిచార రొంపి లోకి దింపి, వారితో వ్యభిచారం చేయిస్తూ వారిపై వచ్చే ఆదాయం ను ఒక వనరు గా ఉపయోగించు కొంటూ, యువకులను మరియు వివాహితులను తమ దగ్గర ఉండే అమ్మాయిల ఫోటో లను పంపి, వారిని ఆకర్షిస్తూ వారి జీవన ప్రమాణాలను దెబ్బ తీయడమే కాక, కుటుంబ కలహా లకు కారణమవుతున్నందున. వ్యభిచార నిర్వాహకులయిన మరియు విటులను ఆరెస్టు చేసి వారి వద్ద నుండి 6 మొబైల్ ఫోన్ లను, కొంత నగదు, కండోమ్స్ లను స్వాదీన పరచుకోవడమైనది మరియు 8 మంది బాధిత స్త్రీ లకు కౌన్సెలింగ్ నిచ్చి, వారిని తమ తమ ఊర్లకు పంపడమైనది. ఆరెస్టు కాబడిన నిర్వాహాకులు
అళ్ల మధుసూదన, కల్లూరు, కర్నూలు, షేక్ అబ్దుల్ రజాక్, మద్దూర్ సుబ్బారెడ్డి నగర్, నందికొట్కూరు, కర్నూలు,
ఆరెపోగు శేఖర్, షరీన్ నగర్, కర్నూలు, ఆరిగెల శ్రీనివాసులు, ఆర్ఎస్ రంగ పురం, బేతంచెర్ల మండలము, డోన్ తాలుకా, పలం సుజాత, బాలాజీ నగర్, కర్నూలు,
గుగుల్లోజ్ సైలు, సంతోష్ నగర్, కర్నూలు, షేక్ మబ్బున్ని, ఈద్గా నగర్, బనగానపల్లె, నంద్యాల జిల్లా,
పులిపాక లక్ష్మి, హనుమాన్ నగర్, విజయవాడ, ఆన్యం నారాయణమ్మ భర్త పేరు పోలిరెడ్డి, 60సం. బాలాజీ నగర్, కర్నూల్, ఆరెస్టు కాబడిన విటులు కురువ రవి బాబు, బింగి బాల అంకన్న
జయకృష్ణ, మిటాయి పరశు రామ్ లాల్, ప్రజలకి ముఖ్య విజ్ఞప్తి ఏమనగా ఇటువంటి వ్యభిచార వ్యవహారాలు నిర్వహించడానికి నిర్మానుష ప్రాంతాలలో తాము ఒక ఫ్యామిలీ గా ప్రజలను మరియు ఇంటి యాజమనులను నమ్మించి వారి ఇండ్ల ను బాడుగ కు తీసుకొని అమ్మాయిల మరియు స్త్రీ లను తెచ్చుకొని ఇటువంటి వ్యభిచార కార్యకలాపాలను నిర్వహిస్తున్నారని, ప్రజలకు ఇటువంటి సమాధారం ఏదయినా తెలిసిన యెడల అట్టి సమాచారం ను డయల్ 112 గానీ, లేదా 91211 01062 కు ఫోన్ చేసి పోలీసు వారికి సమాచారం ఇవ్వవలసినదిగా కర్నూలు నాల్గవ పట్టణ పోలిస్ సీఐ బీవీ విక్రమ సింహ తెలిపారు,