ANDHRA PRADESHCRIME NEWSOFFICIALSTATE NEWS

ఏపీకె ఫైల్స్ లింకులను ఎవరూ కూడా క్లిక్ చేయకూడదు, డౌన్ లోడ్ చేయకూడదు

ఏపీకె ఫైల్స్ లింకులను ఎవరూ కూడా క్లిక్ చేయకూడదు, డౌన్ లోడ్ చేయకూడదు

జిల్లా ఎస్పీ ఇ.జి అశోక్ కుమార్ ఐ.పి.ఎస్

ఏపీకె ఫైల్స్ ను క్లిక్ చేసినట్లయితే వెంటనే మీ వాట్సాప్ ను కూడా సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేస్తారు జాగ్రత్త !

మీ ఫోన్ హ్యాక్ ఆయి సైబర్ నేరగాళ్ళచే మోసపోతారు.

ఎవరూ మోసపోకండి – సైబర్ నేరాల బారిన పడకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండండి

కడప ప్రతినిధి ఆగస్టు 09 యువతరం న్యూస్:

ఇటీవల కాలంలో సైబర్ నేరగాళ్లు ప్రజలను మోసగించేందుకు కొత్త పద్ధతులను అనుసరిస్తున్నారని , గుర్తు తెలియని వ్యక్తులు పంపిన లింక్‌లు, డాక్యుమెంట్లు, ఏపీకె ఫైల్‌లు ఓపెన్ చేయవద్దని జిల్లా ఎస్పీ ఇ.జి అశోక్ కుమార్ ఐపియస్ సూచించారు.ఏపీకె ఫైల్స్ ద్వారా ప్రజల ఫోన్‌లను హ్యాక్ చేసి, వారి వ్యక్తిగత సమాచారం, బ్యాంకింగ్ డేటా, ఫోటోలు మరియు డాక్యుమెంట్లను దొంగలిస్తూ, ఆర్థిక నష్టానికి గురిచేస్తున్నారన్నారు.

మోసం చేయు విధానం :-
1. నిందితులు వాట్సాప్, టెలిగ్రాం, ఇస్టాగ్రామ్ లేదా ఎస్ ఎంఎస్ ల ద్వారా ఒక లింక్ పంపుతారు.

2. “డెలివరీ బాయ్”, “రీఫండ్ లింక్”, “డిజిటల్ కెవైసి, ఎస్బీఐ రివార్డు అప్డేట్, “ఫ్రీ గిఫ్ట్”, “అర్జెంట్ డాక్యుమెంట్, ఈ చలొన్, పీఎం కిసాన్ వంటి పేర్లు గల లింక్‌తో వినియోగదారులను ఆకర్షిస్తారు.

3. ఆ లింక్ ద్వారా ఏపీకె ఫైల్ డౌన్‌లోడ్ అవుతుంది. వినియోగదారుడు దాన్ని యాప్ అనుకుని ఇన్‌స్టాల్ చేస్తాడు.

4. ఆ యాప్ అనుమతులు అడుగుతుంది – ఎస్ఎంఎస్, కాంటాక్ట్స్, కాల్ లాగ్, స్టోరేజ్, నోటీఫికేషన్స్, యాక్సెస్ బిలిటీ మొదలైనవి. పర్మీషన్స్ఇచ్చిన వెంటనే ఫోన్ పూర్తిగా సైబర్ నేరగాళ్ల నియంత్రణలోకి వెళ్తుంది.

5. ఫోన్‌లోని ఓటీపిలు, బ్యాంక్ ఖాతా వివరాలు, క్రెడిట్/డెబిట్ కార్డ్ సమాచారం నేరుగా నిందితులకు అందుతుంది.

6. కొన్నిసార్లు యూపీఐ యాప్‌లను కూడా నేరుగా యాక్సెస్ చేసి ఖాతాల్లోని డబ్బును దొంగిలిస్తారు.

7. అదనంగా, కొన్ని సందర్భాల్లో ఫోన్‌ కెమెరా, మైక్ యాక్సెస్ చేసి వ్యక్తిగత వీడియోలు, ఆడియోలు సేకరించి బ్లాక్‌మెయిల్‌కు కూడా ప్రయత్నిస్తున్నారు.అమాయకులే లక్ష్యం. అంగవైకల్యం ఉన్నవారు, వృద్ధులు,ఆన్‌లైన్ షాపింగ్ చేసే వినియోగదారులు,రైతులు నిరుద్యోగులు, విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు.
జిల్లా ఎస్పీ జిల్లా ప్రజలకు సూచనలు చేశారు.
ప్లే స్టోర్ తప్ప మరో వేదికల నుంచి ఏ యాప్‌ ను డౌన్లోడ్ చేయకండి. గుర్తు తెలియని వ్యక్తులు పంపిన లింక్‌లు, డాక్యుమెంట్లు, ఏపీకె ఫైల్‌లు ఓపెన్ చేయవద్దు.
ఫోన్‌లోని ప్రతి యాప్‌కు ఇచ్చే పార్టీషన్ ను అప్రమత్తంగా పరిశీలించండి.బ్యాంక్ అకౌంట్,యూపీఐ, కార్డు వివరాలను ఎవరితోనూ పంచుకోకండి.మీరు ఫోన్‌లో అనుమానాస్పద యాప్ ఇన్‌స్టాల్ చేసినట్లయితే వెంటనే ఆ యాప్‌ను అన్ఇన్‌స్టాల్ చేయండి.
మొబైల్‌ను రీసెట్ చేసి, ట్రస్ట్ చేసిన యాప్‌లను మాత్రమే తిరిగి ఇన్‌స్టాల్ చేయండి.
ఫోన్‌లో భద్రతాపరమైన భరోసా ఇచ్చే యాప్ ఉపయోగించండి.బ్యాంకింగ్ అప్లికేషన్లలో బయోమెట్రిక్ వాడండి.
మోసానికి గురైనవారు చేయవలసిన చర్యలు:
తక్షణం 1930 నంబర్‌కు కాల్ చేయండి ( నేషనల్ సైబర్ హెల్ప్ లైన్) www.cybercrime.gov.in వెబ్‌సైట్‌లో ఫిర్యాదు నమోదు చేయండి
మీ దగ్గరలో గల పోలీస్ స్టేషన్‌లో రాతపూర్వకంగా ఫిర్యాదు చేయండి.ప్రజలందరూ సైబర్ నేరాల పై అవగాహనతో ఉండాలి. నేటి మోసాలు ఆధునిక పద్ధతుల్లో జరుగుతున్నాయి. వాటిని గుర్తించేందుకు ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు.
“ఎవరూ మోసపోకండి – ఎప్పుడూ అప్రమత్తంగా ఉండండి!”సైబర్ భద్రత జాగ్రత్తలు పాటించండి – మోసాల నుంచి దూరంగా ఉండండి.ఏపీకె ఫైల్స్ ను క్లిక్ చేసినట్లయితే వెంటనే మీ వాట్సాప్ ను కూడా సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేస్తారు.
మీరు ఏపీకె ఫైల్ లింకు ను క్లిక్ చేసిన వెంటనే ఆ లింకు మీరు ఉన్న అన్ని గ్రూప్స్ లలో కూడా ఫార్వర్డ్ అవుతుంది.ఏపీకె ఫైల్స్ లింకులను క్లిక్ చేయకూడదని జిల్లా ప్రజలకు జిల్లా ఎస్పీ ఇ.జి అశోక్ కుమార్ ఐపియస్ విజ్ఞప్తి చేశారు.

YUVATHARAM NEWS

Related Articles

Back to top button
error: Content is protected !!