ముఖ్యమంత్రి పర్యటనకు ముందు తాటిపర్తి గ్రామంలో ఏఎస్ఎల్ కార్యక్రమం

ముఖ్యమంత్రి పర్యటనకు ముందు తాటిపర్తి గ్రామంలో ఏఎస్ఎల్ కార్యక్రమం
పటిష్ట భద్రతా ఏర్పాట్లు
అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా, ఐపీఎస్.,
ఉత్తరాంధ్ర ప్రతినిధి
ఆగస్టు 9
యువతరం న్యూస్:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేడు పాడేరు లో జరగబోయే ప్రపంచ ఆదివాసీ దినోత్సవ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఈ సందర్భంగా, వి.మాడుగుల మండలం, తాటిపర్తి గ్రామంలో ముఖ్యమంత్రి పర్యటనకు అవసరమైన ప్రత్యామ్నాయ భద్రతా ఏర్పాట్లు చేపట్టడానికి అనకాపల్లి జిల్లా పోలీసులు పటిష్టమైన ప్రణాళికను రూపొందించారు.
భద్రతా చర్యల భాగంగా, అడ్వాన్స్డ్ సెక్యూరిటీ లైసెనింగ్ (ఏ ఎస్ ఎల్) కార్యక్రమం నిర్వహించబడిందిఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా, ఐపీఎస్, నర్సీపట్నం ఆర్డీవో వి.వి.రమణ పాల్గొని ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించిన హెలిప్యాడ్ ప్రదేశం, కీలక ప్రాంతాలను ప్రత్యక్షంగా పరిశీలించారు.
ఈ సందర్భంగా ఎస్పీ హెలిప్యాడ్ వద్ద తగిన భద్రతా ఏర్పాట్లు, అగ్నిమాపక సదుపాయాలు, బారికేడింగ్, వైద్య సేవలు, రూట్ మ్యాప్ లభ్యత, ట్రాఫిక్ నియంత్రణ, జనసమూహ నియంత్రణ వంటి అంశాలపై సంబంధిత అధికారులకు అవసరమైన సూచనలు ఇచ్చారు. ముఖ్యమంత్రి పర్యటనలో ఉపయోగించే అన్ని ప్రత్యేక భద్రతా ప్రాంతాలను సమగ్రంగా పరిశీలించారు.
అనకాపల్లి జిల్లా పోలీసులు అన్ని స్థాయిల్లో సమన్వయంతో పని చేస్తూ, ఫైర్ సర్వీసులు, ఆరోగ్య సేవలు, ట్రాఫిక్ మేనేజ్‌మెంట్, పోలీస్ బందోబస్తు, డ్రోన్ మానిటరింగ్, వీఐపీ మువ్మెంట్స్ వంటి విభాగాల్లో ఎటువంటి లోటు లేకుండా ముందస్తు ప్రణాళికలను అమలు చేస్తున్నారు.
ఈ ఏ ఎస్ ఎల్ కార్యక్రమంలో ఆర్డీవో వి.వి.రమణ, అదనపు ఎస్పీ ఎం.దేవ ప్రసాద్, అడ్వాన్స్ సెక్యూరిటీ లైసెన్ ఆఫీసర్ ఆర్.పి.ఎల్.శాంతి కుమారీ, డీఎస్పీలు ఎం.శ్రావణి, పి.నాగేశ్వరరావు, ఆర్ అండ్ బి ఇ.ఇ, ఫైర్ ఆఫీసర్, ఎమ్మార్వో, ఎంపీడీవో, ఎస్.బి సీఐ బాల సూర్యారావు, కె.కోటపాడు సీఐ పైడపునాయుడు, వి.మాడుగుల ఎస్సై నారాయణరావు తదితర అధికారులు పాల్గొన్నారు.
తరువాత, తాటిపర్తి గ్రామానికి సమీపంలో ఏర్పాటు చేస్తున్న ప్రత్యామ్నాయ హెలిప్యాడ్, రహదారి మార్గాలు, ఇతర ముఖ్య ప్రదేశాలను అధికారులు పరిశీలించారు. సీఎం పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని ఆయా శాఖల అధికారులకు జిల్లా ఎస్పీ సూచించారు.