కొత్త అక్రెడిటేషన్లు ఇవ్వాలి

కొత్త అక్రెడిటేషన్లు ఇవ్వాలి
జర్నలిస్టుల డిమాండ్స్ డే
వెల్దుర్తి ఆగస్టు 6 యువతరం న్యూస్:
ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కమిటి పిలుపు మేరకు వెల్దుర్తి లో మంగళవారం జర్నలిస్టుల డిమాండ్స్ డే కార్యక్రమాన్ని చేపట్టారు.మంగళవారం
ఏపీయూడబ్ల్యూజే
ఆధ్వర్యంలో స్థానిక తహశీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు.వినతి పత్రాన్ని డిప్యూటీ తహసీల్దార్ గురుస్వామి రెడ్డి కి అందజేశారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఏపీయూడబ్ల్యూజే పత్తికొండ నియోజవర్గ ఉపాధ్యక్షుడు రాచకొండ చంద్రశేఖర రావు హాజరయ్యారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2024 ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు వర్కింగ్ జర్నలిస్టులకు ప్రమాద బీమా పథకాన్ని పునరుద్ధరణ చేసి ప్రేమియన్ని ప్రభుత్వమే చెల్లించాలి. అర్హులైన జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలి. పాత ఆక్రిడియేష నలు ను పొడిగించకుండా కొత్త కార్డులు ఇవ్వాలి. రాష్ట్ర ,జిల్లా స్థాయిలో అక్రెడిటేషన్ కమిటీలలో జర్నలిస్టు యూనియన్లకు ప్రతినిత్యం కల్పించాలి.హెల్త్ స్కీమ్ ను పటిష్ట పరిచి సమస్యల పరిష్కారం కోసం పర్యవేక్షణ కమిటీని నియమించాలి. విశ్రాంత జర్నలిస్టులకు ఇతర రాష్ట్రాలలో అమలు చేస్తున్న పెన్షన్ పథకాన్ని మన రాష్ట్రంలో కూడా అమలు చేయాలి. ప్రవేట్ విద్య సంస్థల లో పిల్లలకు ఉచితంగా విద్యను అందించాలి. గత ప్రభుత్వం అవలంబించిన విధానాలను ఈ ప్రభుత్వం అనుసరిస్తే జర్నలిస్టుల ఆగ్రహానికి గురి కాక తప్పదు.కార్యక్రమంలో
ఏపీయూడబ్ల్యూజే నాయకులు. అమీర్,తాజుబాబా, ఈశ్వరయ్య, ఒమేంద్ర,దస్తగిరి, అంజి,అశోక్, రాజు, శేఖర్, రాజశేఖర్, వడ్డే మారెన్న,నజీర్ బాషా, తదితరులు పాల్గొన్నారు.