ANDHRA PRADESHOFFICIAL

నులిపురుగుల నివారణ ద్వారా చిన్నారులకు పరిపూర్ణ ఆరోగ్యం

నులిపురుగుల నివారణ ద్వారా చిన్నారులకు పరిపూర్ణ ఆరోగ్యం

నంద్యాల/ఆత్మకూరు ప్రతినిధి ఆగస్టు 05 యువతరం న్యూస్:

నులిపురుగుల నివారణ కోసం చిన్నారులకు ఇచ్చే ఒక్క అల్బెండజోల్ మాత్ర వారికి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండేందుకు తోడ్పడుతుందని అందుకు తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా వైద్య, అనుబంధ శాఖ అధికారులను ఆదేశించారు.

సోమవారం ఆత్మకూరు డివిజన్ కేంద్రంలోని నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం అనంతరం రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమంలో భాగంగా నులిపురుగుల నివారణకు సంబంధించిన పోస్టర్లను జిల్లా కలెక్టర్ ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా మాట్లాడుతూ జాతీయ నులి పురుగుల నిర్మూలన కార్యక్రమంలో భాగంగా ఆగస్టు 12వ తేదీన జాతీయ నులిపురుగుల దినోత్సవం నిర్వహించడం జరుగతుందన్నారు. ఇందులో భాగంగా ఈ మాత్రలను అన్ని అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలు, పాఠశాలలు‌‌ (ప్రభుత్వ మరియు ప్రైవేటు), జూనియర్ కళాశాలు, ఐటిఐ, పాలిటెక్నిక్ కళాశాలలో ఉన్న చిన్నారులు, విద్యార్థులకు నులి పురుగు నివారణ మాత్రలు (అల్బెండజోల్) అందజేయాలన్నారు. 1సం. నుండి 2సం.లు ఉన్న చిన్నారులకు భోజనం తరువాత అల్బెండజోల్ సగం మాత్ర, 3సం.ల నుండి 19సం.ల విద్యార్థులకు అల్బెండజోల్ ఒక మాత్ర భోజనం అనంతరం అందజేసేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత వైద్య అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఈ నులి పురుగుల వల్ల ఆహారం జీర్ణం కాకపోవడం, రక్తహీనత తదితర అనారోగ్య రుగ్మతలు వచ్చే అవకాశం ఉందన్నారు. ఈ మాత్రలను తీసుకోవడం వల్ల రక్తహీనతను నిర్మూలించడంతో పాటు పోషకాహార ద్వారా వ్యాధినిరోధక శక్తిని మెరుగుపడుతుందని జిల్లా కలెక్టర్ కు తెలిపారు. ముఖ్యంగా ఈ నులిపురుగులు అపరిశుభ్రమైన ఆహారం, కలుషితమైన నీరు తీసుకోవడం వల్ల నులి పురుగులు ఏర్పడే అవకాశం ఉంటుందన్నారు. ఒకవేళ ఆగస్టు 12వ తేది పొరపాటున సదరు మాత్రలు తీసుకొని వారికి మరల ఆగస్టు 20వ తేదిన మాప్-అప్ కార్యక్రమం ద్వారా ఇవ్వడం జరుగుతుందన్నారు. జ్వరం ఉన్నపుడు ఈ మాత్రలను తీసుకోకూడదన్నారు. మండల కేంద్రాలకు పంపిణీ చేసిన అల్బెండజోల్ మాత్రలను ఎంపిడిఓల ఆధ్వర్యంలో అన్ని పాఠశాలకు, పిహెచ్సి కేంద్రాలకు అందజేసేలా చర్యలు తీసుకోవాలన్నారు.

కార్యక్రమంలో ఆత్మకూరు ఆర్డీఓ నాగజ్యోతి, ఆత్మకూరు తహశీల్దార్ రత్న రాధిక, మండల స్థాయి వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

YUVATHARAM NEWS

Related Articles

Back to top button
error: Content is protected !!