అల్లూరి జిల్లా హ్యూమన్ రైట్స్ కమిటీ సభ్యుల సమావేశం

అల్లూరి జిల్లా హ్యూమన్ రైట్స్ కమిటీ సభ్యుల సమావేశం
జి. మాడుగుల ఆగస్టు 5
యువతరం న్యూస్:
అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి మండలం లంబసింగి పంచాయితీ బిల్డింగ్ లో అల్లూరి సీతారామరాజు జిల్లా హ్యూమన్ రైట్స్ కమిటీ సభ్యులు సమావేశం నిర్వహించడం జరిగింది.
ఈ సమావేశంలో అల్లూరి సీతారామరాజు జిల్లా హ్యూమన్ రైట్స్ కమిటీ సభ్యులు జిల్లా ప్రెసిడెంట్ పి. సత్తిబాబు, వైస్ ప్రెసిడెంట్, జి. లక్ష్మణ్, జి మాడుగుల, హ్యూమన్ రైట్స్ మండల కమిటీ సభ్యులు, ప్రెసిడెంట్ ఎం. సన్యాసిరావు, పంచాయతీ ,కమిటీ సభ్యులు
ఎం. జగ్గారావు, పి. బాలరాజు, గ్రామ కమిటీ సభ్యులు, కె. కొండబాబు, హాజరై హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిటీ విషయాలను గురించి మాట్లాడుతూ సుదీర్ఘంగా చర్చించిస్తు.
అల్లూరి సీతారామరాజు జిల్లా హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిటీ సభ్యులు జిల్లా ప్రెసిడెంట్
పి. సత్తిబాబు మాట్లాడుతూ ఇలా అన్నారు.
హ్యూమన్ రైట్స్ అంటే మానవ హక్కులు,
మానవ హక్కులు అంటే, మానవులుగా పుట్టిన ప్రతి ఒక్కరికి సహజంగా లభించే హక్కులని ఎటువంటి వివక్ష లేకుండా ప్రతి ఒక్కరికి వర్తించేవి అని వ్యక్తి యొక్క గౌరవం, స్వేచ్ఛ, మరియు, సమానత్వాన్ని, ఇచ్చేదని, మానవ హక్కులు అనేవి ప్రాథమిక హక్కులు, కనుక ఇవి ప్రతి వ్యక్తికి వారి జాతి, లింగం, మతం, లేదా, సమాజిక నేపథ్యంతో సంబంధం లేకుండా వ్యక్తి యొక్క గౌరవ ప్రదమైన జీవితాన్ని గడపడానికి అవసరమైన ప్రాథమిక పరిస్థితులను కల్పించేవి అని అన్నారు.
జీవించే హక్కును, స్వేచ్ఛ మరియు భద్రత హక్కును, ఎవరు కూడా వివక్షకు గురి కాకూడదు అని అభిప్రాయ ప్రకటన స్వేచ్ఛ
ను కల్పించేదె హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ అని పి.సత్తీబాబు అన్నారు. విద్యా, ఆరోగ్యం, న్యాయపరమైన రక్షణ, సమాజంలో సమానత్వముగా సామాన్యుని మొదలుకొని
పాలకుల వరకు అందరికీ సమాన హక్కును ఇచ్చేదే హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్, అని వివరించారు. గనుక హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిటీ బాధ్యతలు స్వీకరించి ఉన్న మనమందరం ఎంతో జాగ్రత్తతో జిల్లా కమిటీ సభ్యులైన, మండల సభ్యులైన, పంచాయితీ గ్రామ సభ్యులైన, ఎంతో బరువు బాధ్యతలతో కూడిన దిగనుక కమిటీ సభ్యులదరూ ప్రజల మనోభావాలకు భంగం కలిగించే విధంగా కాకుండా చట్టవిరోధ పనులకు పాలు పడకుండా ప్రజల న్యాయం కొరకు పోరాడే
దిశగా అడుగులు ముందుకు వెయ్యాలని కోరారు. బడుగు బలహీనులు న్యాయం కొరకు నిత్యం
పాటుపడే దిశగా మన న్యాయపోరాటం కొనసాగించే వారిగా ఉండాలి అంటూ
హ్యూమన్ రైట్స్ కమిటీ సభ్యులందరితో ఈ సంగతులను తెలియజేసి కమిటీ సభ్యులందరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ
ప్రసంగం ముగించారు.