వానమ్మ ఒక్కసారి వచ్చిపోమంటూ మహిళల పాటలు

వానమ్మ ఒక్కసారి వచ్చిపోమంటూ మహిళల పాటలు
వర్షాల కోసం మహిళల పూజలు
దేవనకొండ జూలై 3 యువతరం న్యూస్:
దేవనకొండలో వడ్డే వీధి నందు మహిళలందరూ ఐక్యమత్యంతో వర్షం కోసం పాటలతో ప్రత్యేక పూజలు, నిర్వహించారు. వేసిన పంటలు ఎండిపోతున్నాయు వానమ్మ ఒకసారి వచ్చి పోమంటూ మహిళలు పాటలు పాడారు. గత 20 రోజులకు పైగా వర్షాలు లేకపోవడంతో రైతులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. కూలికి వెళ్దామంటే వర్షాలు లేకపోవడంతో పనులు కూడా లేవు. ఒకవైపు రైతులు, మరోవైపు కూలీలు వర్షాలు లేకపోవడంతో ఆందోళన చెందుతున్నారు.
వర్షం కోసం పూజలు అనేవి వర్షాలు కురవాలని కోరుతూ చేసే ప్రత్యేక పూజలు. సాధారణంగా, వర్షాలు సరిగకురవని సమయాల్లో, రైతులు, ప్రజలు దేవుళ్ళను ప్రార్థిస్తూ, వర్షం కోసం పూజలు, యాగాలను నిర్వహిస్తారు.
వర్షం కోసం పూజలు, యాగాలు చేయడం వెనుక ఉన్న ప్రధాన కారణం ప్రజల నమ్మకం. వారు వర్షాలు కురవాలని దేవుళ్ళను ప్రార్థిస్తే, వర్షాలు కురుస్తాయని నమ్ముతారు. ఇది కాకుండా, ఇది ప్రజల మధ్య ఐక్యతను, సామూహిక ప్రార్థనలను ప్రోత్సహిస్తుందని ప్రజలకు గట్టి నమ్మకం.