అన్నదాతల సంక్షేమమే… కూటమి ప్రభుత్వ ధ్యేయం.!

అన్నదాతల సంక్షేమమే… కూటమి ప్రభుత్వ ధ్యేయం.!
కొత్తపల్లి ఆగస్టు 3 యువతరం న్యూస్:
అన్నదాతల సంక్షేమ కూటమి ప్రభుత్వ దేయమని అన్నదాతల అభివృద్ధి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుతోనే సాధ్యమని ఆంధ్రప్రదేశ్ సివిల్ సప్లై కార్పోరేషన్ డైరెక్టర్ తలముడిపి మహేష్ నాయుడు అన్నారు. అన్నదాత సుఖీభవ ప్రారంభించిన సందరద్భంగా శనివారం మండల పరిధిలోని ఎర్రమఠం గ్రామాల్లో రైతులతో కలిసి ఆయన చంద్రబాబు చిత్రపటానికి పాలభిషేకం చేశారు వైకాపా ప్రభుత్వంలో పీఎం కిసాన్తో కలిపి రూ.13500 మాత్రమే ఇచ్చి కూటమి ప్రభుత్వం రూ.20వేలకు పెంచిందన్నారు. మల్యాల హంద్రీనివా కాలువ వెడల్పు పనులు ఛాలెంజ్ తీసుకుని 100 రోజుల్లో పూర్తి చేసి ఆయకట్టు ప్రతి ఎకరాకు నీరందించే ఘనత చంద్రబాబు రాయుడు కే దక్కుతుందన్నారు. రైతులకు రాయితీ పనిముట్లు, తోట సాగుకు ఆర్థికసాయం వంటి ఎన్నో పథకాలు అందిస్తున్నారు వైకాపా ప్రభుత్వానికి ఒక్కసారి అధికారాన్ని ఇస్తే రాష్ట్రం అప్పులమయంగా మారించదదన్నారు. అలా కాకుండా రైతులు మరింతా అభివృద్ధి చెందాలంటే వరుసగా బాబుపాలనే రావాలన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగు యువత పాములపాడు మండల అధ్యక్షులు మధుకృష్ణా, కొలను భారతి చైర్మన్ వెంకట నాయుడు కెవి శివారెడ్డి మాజీ సర్పంచ్ గోపాల్ రెడ్డి మద్దిలేటి మల్లికార్జున రాజు చిన్న రాజు వెంకటేశ్వర్లు శ్రీనివాస యాదవ్ ఆఫీసఖాన్,మల్లికార్జున, వెంకటేశ్వర్లు సుబ్బరాయుడు జగదీష్ తదితరులు పాల్గొన్నారు.