ANDHRA PRADESHOFFICIAL

రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

రైతు బాగుంటేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది

రైతుల శ్రేయస్సు కోసం విశేష కృషి చేస్తున్న ముఖ్యమంత్రి

రాష్ట్ర మైనార్టీ, న్యాయ, సంక్షేమశాఖ మంత్రి ఎన్ ఎం డి ఫరూక్

రైతులందరికీ అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ పథకం

రైతులు అధికం మోతాదులో యూరియా వాడరాదు

జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా

నంద్యాల బ్యూరో ఆగస్టు 3 యువతరం న్యూస్:

రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని, రైతుల సంక్షేమం కోసం దేశంలో ఎక్కడా లేనివిధంగా మన రాష్ట్రంలో అనేక కార్యక్రమాలు అమలు చేయడం జరుగుతుందని రాష్ట్ర మైనార్టీ, న్యాయ, సంక్షేమశాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ పేర్కొన్నారు.

శనివారం రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రకాశంజిల్లా, దర్శి గ్రామంలో అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ పథకం, 2025- 26 ఆర్థిక సంవత్సరానికి మొదటి విడతగా ఒక్కొక్క రైతుకు అన్నదాత సుఖీభవ ద్వారా 5వేలు, పీఎం కిసాన్ ద్వారా 2, వేలు మొత్తం 7000 రూపాయలు రైతుల ఎకౌంటుకు జమ చేయడం జరిగింది.

ఈ సందర్భంగా నంద్యాల మండల పరిధిలోని కానాల గ్రామంలోని బుగ్గ రామేశ్వరం దేవాలయంలో ఏర్పాటు చేసిన అన్నదాత సుఖీభవ-పీఎం కిసాన్ జిల్లా స్థాయి కార్యక్రమంలో రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్, జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా, రైతు సంఘాల నాయకులు, వ్యవసాయ శాఖ అధికారులు, పాల్గొని పీఎం సీఎం గారి ప్రత్యక్ష ప్రసంగాన్ని వీక్షించారు.

ఈ సందర్భంగా రాష్ట్ర మైనార్టీ, న్యాయ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ ఎం డి ఫరూక్ మాట్లాడుతూ….రైతులు పంట వేసినప్పటినుంచి ధాన్యం ఇంటికి వచ్చేవరకూ ప్రభుత్వం అండగా ఉంటూ రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధరలు కల్పించడం జరుగుతుందన్నారు. రైతు బాగుంటే రాష్ట్రం, దేశం అభివృద్ధి చెందుతుందనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి నారాచంద్రబాబునాయుడు గారు రైతుల సంక్షేమానికి విశేష కృషి చేయడం జరుగుతుందన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలు చేయడం జరుగుతుందన్నారు. రైతులు పంట వేసి నష్ట పోయినట్లయితే వెంటనే వారికి ఇన్సూరెన్స్ ద్వారా నష్టపరిహారం ఇవ్వడం జరుగుతుందన్నారు. రైతు సేవ కేంద్రాల ద్వారా ఎరువులు, విత్తనాలు, పురుగుమందులు ఇవ్వడం జరుగుతుందన్నారు. రైతులందరూ ఈ క్రాప్ పంట నమోదు చేసుకోవాలని ఈ క్రాపు పంట నమో ద్వారా ప్రభుత్వ పథకాలు రైతులకు సులభతరంగా అందజేయడం జరుగుతుందన్నారు. రైతులు ఆధునిక వ్యవసాయ పద్ధతులను అనుసరించి వ్యవసాయ రంగంలో విశేష మార్పు కనిపించే విధంగా సబ్సిడీతో యంత్ర పరికరాలు ఇవ్వడం జరుగుతుందన్నారు.
గతంలో పెన్షన్, రేషన్ కార్డులు కావాలంటే కార్యాలయాల చుట్టూ తిరిగే వారిని నేడు అధికారులు ప్రజాప్రతినిధులు లబ్ధిదారుల గుమ్మం తట్టి వారికి పథకాలు అందించడం జరుగుతుందన్నారు. మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం, తల్లికి వందనం పథకం ద్వారా ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉంటే అంత మందికి ఈ పథకం వర్తింపజేయడం జరుగుతుందన్నారు. ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించడం జరుగుతుందన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్లు నాలుగువేల నుంచి 15 వేల వరకు ఇవ్వడం జరుగుతుందన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో ఎప్పుడూ ఎన్నడూ లేని విధంగా ప్రతి కుటుంబానికి దాదాపు లక్ష రూపాయల వరకు ప్రభుత్వం ఆర్థిక సహాయం అందజేయడం జరుగుతుందన్నారు.
గతంలో నంద్యాల జిల్లాలో కేసీ కెనాల్ కాలువ తప్ప ఏమీ లేదని ప్రస్తుతం మన ప్రాంతంలో నాలుగైదు కాలువల ద్వారా ఈ ప్రాంతానికి నీరు వస్తుందన్నారు. ఇదంతా దివంగత ఎన్టీ రామారావు గారి కృషి వల్ల నేడు నంద్యాల జిల్లా సస్యశ్యామలంగా ఉందన్నారు. నేడు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వ్యవసాయాన్ని మూడు పువ్వులు ఆరుకాయలుగా మరింత అభివృద్ధి చేయడం జరుగుతుందన్నారు.
రైతులు ఎక్కువ మోతాదులో యూరియా వాడకుండా అవసరం మేరకు మాత్రమే వాడాలన్నారు. ఎకరాకు కేవలం రెండు బ్యాగులు మాత్రమే యూరియా వాడాలని ఎక్కువ యూరియా వాడడం వల్ల భూసారం దెబ్బతిని ప్రజలకు అనేక రోగాలు ప్రబలే అవకాశం ఉందన్నారు.
గతంలో వర్షాధారం మీద ఆధారపడి మన ప్రాంతంలో ఉన్న చెరువులు కుంటలు నిండే పరిస్థితి ఉండేదని నేడు తెలుగు గంగా, హెచ్ ఎన్ ఎస్ ఎస్ తదితర కాలువల ద్వారా మన చెరువులు నింపుకునే పరిస్థితి వచ్చిందన్నారు. ప్రస్తుతం అమరావతి నుంచి కుప్పం వరకు కాలువల ద్వారా నీరు పోవడంతో మన ప్రాంత వ్యవసాయ భూములకు అధిక డిమాండ్ ఏర్పడిందన్నారు. వెనకబడి ఉన్న మన ప్రాంతానికి మంచి డిమాండ్ రావడం ప్రభుత్వం చేసే అభివృద్ధి కార్యక్రమాల వల్లనే అన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో చాలామంది నిరుద్యోగులకు ఉపాధిగా అవకాశాలు కల్పించడం జరుగుతుందన్నారు. మెగా డీఎస్సీ ద్వారా టీచర్ పోస్టులు భర్తీ మరియు పోలీస్ ఉద్యోగాలు కూడా చాలామందికి రావడం జరిగిందన్నారు. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య రాకుండా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.
గతంలో ముఖ్యమంత్రివర్యులు హైదరాబాదును ఎంతో అభివృద్ధి చేయడం జరిగిందని అదేవిధంగా అమరావతిలో విద్యాసంస్థలు పరిశ్రమలు ఔటర్ రింగ్ రోడ్డు వంటి అభివృద్ధి పనులు చేసి రాజధాని రూపురేఖలు మార్చేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఇలాంటి మంచి ప్రభుత్వం పదికాలాలపాటు ఉండేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.

అనంతరం జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా మాట్లాడుతూ…. అన్నదాత సుఖీభవ-పిఎం కిసాన్ ద్వారా 10సెంట్లు పైబడి ఉన్న రైతులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో రైతులకు పెట్టుబడి ఆర్థిక సాయంగా ప్రతి సంవత్సరం రూ.20 వేలు అందజేయడం జరుగుతోందన్నారు. అందులో భాగంగా మొదటి విడత ఖరీఫ్ సాగుకు రూ.7వేలు (అన్నదాత సుఖీభవ రూ.5వేలు, పిఎం కిసాన్ రూ.2వేలు) అందజేయడం జరుగుతుందన్నారు. అదే విధంగా రెండవ విడత రూ.7వేలు (అన్నదాత సుఖీభవ రూ.5వేలు, పిఎం కిసాన్ రూ.2వేలు) రబీ సాగుకు అందజేయడం జరుగుతుందన్నారు. అంతేకాకుండా వేసవి కాలంలో మూడవ విడత రూ.6వేలు (అన్నదాత సుఖీభవ రూ.4వేలు, పిఎం కిసాన్ రూ.2వేలు) చేయూత ఇవ్వడం జరుగుతుందన్నారు. ఈ నగదు ద్వారా రైతులు పెట్టుబడి సహాయం కోసం ఎవ్వరి మీద ఆధారపడకుండా ప్రభుత్వమే రైతుల అభ్యున్నతికి కృషి చేయడం ద్వారా రైతులు పెట్టుబడి తగ్గి దిగుబడి పెరిగేలా, మార్కెటింగ్ సౌలభ్యం పెంచడం ద్వారా వారు పండించిన పంటకు వారే ధర నిర్ణయించే స్థాయికి ఎదిగేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తోందన్నారు. జిల్లాలో ఉన్న 2,06,052 మంది రైతాంగానికి రూ.140.57 కోట్లు అన్నదాత సుఖీభవ-పిఎం కిసాన్ పథకాల ద్వారా నగదు విడుదల చేయడం జరిగిందన్నారు. ఖరీఫ్ సీజన్ లో 3.26 లక్షల హెక్టార్లలో ఎక్కువ శాతం వరి, మొక్కజొన్న వేయడం జరుగుతుందన్నారు. జిల్లాలో కృష్ణ నది జలాలు సమృద్ధిగా ఉన్నాయని వాటి ద్వారా సుమారుగా 5.98 లక్షల వేల ఎకరాల్లో సాగుకు సరిపడా కెనాల్ వ్యవస్థ నీరును సద్వినియోగం రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. రైతులు యూరియా ఎక్కువ వాడటం వల్ల భూసారం దెబ్బతిని సూక్ష్మ పోషకాలు తగ్గిపోయి దిగుబడి తగ్గే అవకాశం ఉంటుందన్నారు. వ్యవసాయ అధికారుల సలహా, సూచనలు పాటిస్తూ అవసరమైన మేరకు మాత్రమే యూరియా వాడాలన్నారు.

జిల్లాలో ఇప్పటి వరకే 22 వేల మెట్రిక్ టన్నుల ఎరువులను రైతులకు రైతు సేవ కేంద్రాలు, మార్క్ఫెడ్, పాక్స్ ద్వారా అందజేయడం జరిగిందన్నారు. ఇంకనూ 3500 మెట్రిక్ టన్నుల యూరియా లభ్యం ఉన్నాయన్నారు. వరి పంటకు యూరియా కేవలం రెండు లేక మూడు బస్తాలు వినియోగిస్తే సరిపోతుందని, అదికాక రైతులు అధిక మోతాదులో యూరియాను వినియోగించకుండా చూడాలన్నారు. జిల్లాలో ఇప్పటి వరకే నలబై డ్రోన్లు ఉన్నాయని, వాటితోపాటు రైతు గ్రూపులకు 40 ఇవ్వడం జరుగుతుందని వాటి ద్వారా పంటలకు వేగవంతంగా రసాయనాలను పిచికారి చేసే అవకాశం ఉంటుందన్నారు. జిల్లాలో ఇప్పటివరకు 50 వేల ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం చేపట్టడం జరుగుతుందని దానిని లక్ష ఎకరాలకు పెంచేలా ప్రజా ప్రతినిధులు, వ్యవసాయ అధికారులు, రైతుల సహకారంతో ముందుకెళ్తున్నామన్నారు. పొలంలో వేసే పంట కంటే పొలం గట్ల మీద వేసే పంటల ద్వారా అధిక దిగుబడి వచ్చే అవకాశం ఉంటుందన్నారు. నంద్యాల సన్నబియ్యానికి ప్రభుత్వం సరిపడా మద్దతు ధర ఇస్తున్నప్పటికీ రైతులు వర్షాలకు భయపడి వాటిని తక్కువ ధరలకు విక్రయించడం ద్వారా నష్టం వచ్చే అవకాశం ఉంటుందన్నారు. అందుకు రైతులు జిల్లాలో ఉన్న శీతల గిడ్డంగులలో వారి పంటలను నిలువ చేసుకొని అధిక దిగుబడి వచ్చినప్పుడు వాటిని విక్రయించేలా చూడాలని కలెక్టర్ రైతులకు సూచించారు.

*అన్నదాత సుఖీభవ-పిఎం కిసాన్ ద్వారా లబ్ధి పడని లబ్ధిదారులు కంగారు పడకుండా సచివాలయంలో దరఖాస్తులు ఇచ్చినట్లయితే వాటిని స్వీకరించి పరిష్కరించేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ప్రభుత్వ పథకాలు పొందాలంటే ప్రతి రైతు ఈకెవైసి తప్పక చేయించుకొని ఉండాలన్నారు. అదేవిధంగా ఎన్పీసీఐ పోర్టల్ లో రైతుల బ్యాంకు ఖాతాకు ఆధార్ ట్యాగ్ అయ్యేలా చూసుకోవాలన్నారు. అందుకు రైతు సేవా కేంద్రాలు, బ్యాంక్ అధికారులు సంప్రదించి తగిన చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో సుమారుగా 30వేల మంది రైతులకు సిసిఆర్సి కార్డులు ఇవ్వడం జరిగిందన్నారు. కౌలు రైతులు వారి పంటను ఈ-పంటలో కూడా నమోదు చేయించాలన్నారు. కౌలు రైతులకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సహాయం ఒకేసారి పదివేల రూపాయలు జమ అవ్వడం జరుగుతోందన్నారు. వెబ్ ల్యాండ్ రికార్డ్స్ లో వారి పేరు ఉందో లేదో చెక్ చేసుకోవాలన్నారు. అందుకు సంబంధించి ఎటువంటి సమస్యలు ఉన్న సమస్యలను పరిష్కరించి త్వరితగతిన నగదు జమ అయ్యేలా చర్యలు తీసుకోవడం జరుగుతోందన్నారు. అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రతి పథకాన్ని అర్హులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
పిఎం సూర్య ఘర్ పథకం క్రింద మిద్దె ఉన్న వారందరూ కూడా సోలార్ ఫలకలను ఏర్పాటు చేసుకోవాలని వాటి ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక మినహాయింపు ఇవ్వడంతో పాటు బ్యాంకు రుణాలు కూడా మంజూరు చేయడం జరుగుతుందని వాటిని గ్రామస్తులు పూర్తిగా సద్వినియోగం చేసుకొని లబ్ధి పొందాలని కలెక్టర్ గ్రామస్తులకు వివరించారు.

అనంతరం అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ పథకాలకు సంబంధించి 206052 మంది రైతులకు రూ.140.57 కోట్ల మెగా చెక్కును మంత్రి, జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా రైతులకు అందజేశారు.

అన్నదాత సుఖీభవ-పిఎం కిసాన్ పథకానికి సంబంధించి పలువురు రైతుల అభిప్రాయాలు

రైతులను ఆదుకున్న కృషివలుడు రాష్ట్ర ముఖ్యమంత్రి

నంద్యాల మండలం కానాల గ్రామానికి చెందిన పి. జిక్రియా భాష తనకున్న ఎకరా పొలంలో వరి పండిస్తూ ఎంతో లబ్ధి పొందుతున్నానన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న తల్లికి వందనం ద్వారా నగదు జమ్మవ్వడం జరిగిందని, అంతేకాకుండా దీపం-2 పథకం ద్వారా గృహిణులకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుందన్నారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రజల శ్రేయస్సు కోసం ప్రవేశపెడుతున్న సంక్షేమ కృషి చేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి రుణపడి ఉంటామన్నారు.

అన్నదాత సుఖీభవ-పిఎం కిసాన్ అందడం చాలా సంతోషం

నంద్యాల మండలం కానాల గ్రామానికి చెందిన సురేష్ తనకున్న 6 ఎకరాల భూమిలో వివిధ రకాల పంట పొలాలను పండిస్తూ లబ్ధి పొందుతున్నానని తెలిపారు. అదేవిధంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న ఆర్థిక తోడ్పాటు మధ్యతరగతి రైతులకు ఎంతో చేయూతగా ఉంటుందని ఆనందం వ్యక్తం చేస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి కి కృతజ్ఞతలు తెలిపారు. అంతేకాకుండా ప్రభుత్వం అమలు చేస్తున్న ఎన్టీఆర్ పెన్షన్, దీపం పథకం ద్వారా ఎంతో లబ్ధి పొందడం జరుగుతోందన్నారు.

ప్రభుత్వ సాయం…….మరువలేనిది

నంద్యాల మండలం కానాల గ్రామానికి చెందిన పెద్ద నాగపుల్లయ్య తనకు ఉన్న ఒక్కటిన్నర పొలంలో పంట పొలాలు సాగు చేసుకుంటూ జీవనోపాధి పొందుతున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న అన్నదాత సుఖీభవ-పిఎం కిసాన్ ద్వారా రూ.7వేలు జమ కావడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ నగదు ద్వారా పంట విత్తనాలు కొనుగోలు, ఇతర ఖర్చులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని రైతు హర్షం వ్యక్తం చేశారు.

YUVATHARAM NEWS

Related Articles

Back to top button
error: Content is protected !!