పీఎం సూర్య ఘర్ పథకం ద్వారా జిల్లాను గ్రీన్ ఎనర్జీగా తీర్చిదిద్దాలి

పీఎం సూర్య ఘర్ పథకం ద్వారా జిల్లాను గ్రీన్ ఎనర్జీగా తీర్చిదిద్దాలి
ప్రతి ఒక్కరూ పీఎం సూర్యా ఘర్ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి
ప్రతి ఇంటిపై సోలార్ వెలుగులు నింపాలి
నంద్యాల జిల్లాను సోలార్ వెలుగులతో నింపి దేశంలో ఆదర్శంగా నిలపాలి
పీఎం సూర్య ఘర్ పథకంపై ప్రజలకు అవగాహన కల్పించాలి
గృహాలకు సోలార్ విద్యుత్ అందించడమే లక్ష్యంగా ముందుకు వెళ్లాలి
జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా
నంద్యాల బ్యూరో జులై 30 యువతరం న్యూస్:
ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకం ద్వారా నంద్యాల జిల్లాను గ్రీన్ ఎనర్జీగా తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్ జి.రాజకుమారి గణియా పేర్కొన్నారు.
మంగళవారం జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా, కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి పీఎం సూర్య ఘర్ పథకంపై ఆర్డీవోలు, మున్సిపల్ కమిషనర్లు, తహసిల్దార్ లు, ఎంపీడీవోలు, ఏపిఎం లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా మాట్లాడుతూ…. నంద్యాల జిల్లాలో ప్రతి ఒక్కరూ పీఎం సూర్య ఘర్ పథకాన్ని సద్వినియోగం చేసుకొని జిల్లాను గ్రీన్ ఎనర్జీగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలన్నారు. ఈ పథకం ద్వారా ఆదాయం పెరగడంతో పాటు పొల్యూషన్ నివారించి ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించుకునేందుకు దోహదపడుతుందన్నారు. ఒకసారి ఇంటి పై కప్పులపై సోలార్ ప్యానల్ పెట్టుకుంటే 25 ఏళ్ల వరకు విద్యుత్ సమస్య ఉండదన్నారు. ఎక్కువ విద్యుత్ ఉత్పత్తి అయితే ప్రభుత్వానికి అమ్మవచ్చు
కరెంటు పోతుందనే టెన్షన్ ఉండదు
ఈ వి, ఎలక్ట్రానిక్ వాహనాలు చార్జింగ్ లాంటివి కూడా ఏర్పాటు చేసుకోవచ్చునన్నారు. కావున ప్రతి గ్రామాన్ని మోడల్ సోలార్ విలేజ్ గా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలన్నారు. ఆర్డీవోలు, మున్సిపల్ కమిషనర్లు, తహసిల్దార్లు, ఎంపీడీవోలు, ఏపీఎంలు, గ్రామాలకు వెళ్లి ప్రజాప్రతినిధులను ఎంపీటీసీ, జడ్పిటిసి తదితరులను ఇన్వాల్వ్ చేసి ప్రతి ఇంటి రూప్ టాప్ పైన సోలార్ సిస్టం ఇన్స్టాల్ చేసుకునే విధంగా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ఈ కార్యక్రమం విజయవంతం అయ్యేందుకు బ్యాంకర్ల సహకారం ఎంతో అవసరమన్నారు.
నంద్యాల జిల్లాలోని ఏడు నియోజకవర్గాలలో ఒక్కొక్క నియోజకవర్గానికి 10 వేలు టార్గెట్ ఇవ్వడం జరిగిందన్నారు. ఏడు నియోజకవర్గాలకు కలిపి 70 వేల టార్గెట్ చేయాల్సి ఉందన్నారు.
ఈ పథకం ద్వారా ఒక కిలో వాట్ కు 30 వేల సబ్సిడీ, 2, కిలో వాట్స్ కి 60 వేలు,
3,కిలో వాట్స్ కి 78, వేలు సబ్సిడీ ఉంటుందన్నారు. ఎస్సీ ఎస్టీలకు 100% సబ్సిడీ ఉంటుందన్నారు. మంచి పథకాన్ని ప్రతి ఒక్కరు సద్వివేగం చేసుకుని రాబోయే రోజులలో నంద్యాల జిల్లాను సోలార్ వెలుగులతో నింపి దేశంలోనే ఆదర్శ జిల్లాగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపట్టాలన్నారు.