మండలానికి రెండు విద్యార్థి బస్సులు ఏర్పాటు చేయాలి..

మండలానికి రెండు విద్యార్థి బస్సులు ఏర్పాటు చేయాలి.
ఏఐఎస్ఎఫ్ – డివైఎఫ్ఐ
దేవనకొండ జూలై 25 యువతరం న్యూస్:
దేవనకొండ మండలానికి రెండు విద్యార్థి బస్సులు ఏర్పాటు చేయాలని ఏఐఎస్ఎఫ్ మండల కార్యదర్శి భాస్కర్, డివైఎఫ్ఐ మండల కార్యదర్శి శ్రీనివాసులు ఆధ్వర్యంలో గురువారం తహసిల్దార్ కార్యాలయం ముందు విద్యార్థులు కలిసి ధర్నా నిర్వహించారు. వారు మాట్లాడుతూ వివిధ గ్రామాల నుండి మండల కేంద్రానికి విద్యను అభ్యసించడానికి వచ్చేటువంటి విద్యార్థులు రవాణా కొరకు బస్సులు ఆటోలు తదితర సౌకర్యాలను ఉపయోగియించుకుంటున్నారు. ఆటోలలో పరిమితికి మించి విద్యార్థులను ఎక్కించుకోవడంతో ఏమాత్రం రక్షణ ఉండదన్నారు. ఒకే ఒక విద్యార్థి బస్సు ఉండడంతో 300 మంది విద్యార్థులు ఆ బస్సు కు రావడంతో ఊపిరాడకా ఈ మధ్యకాలంలోనే పలుమార్లు విద్యార్థులు ప్రమాదాలకు గురయ్యారు. విద్యార్థులకు అనుగుణంగా రెండు బస్సులు ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు.అనంతరం ఆర్ ఐ కు వినతి పత్రం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం మండల ఉపాధ్యక్షులు యూసుఫ్ భాష, మాదన్న, రవి, రామాంజిని,శివ,విద్యార్థులు పాల్గొన్నారు.