శ్రీశైల మహా క్షేత్రం నందు శ్రీ స్వామి అమ్మవార్ల హుండీ లెక్కింపు

శ్రీశైల మహా క్షేత్రం నందు శ్రీ స్వామి అమ్మవార్ల హుండీ లెక్కింపు
శ్రీశైలం ప్రతినిధి జూలై 25 యువతరం న్యూస్:
ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలం మహా క్షేత్రం నందు శ్రీ స్వామియే అమ్మవార్ల హుండీ లెక్కింపు ద్వారా శ్రీశైల దేవస్థానానికి సుమారు రూ.4,17,61,215/-నగదు రాబడిగా లభించింది.
కాగా ఈ హుండీల రాబడిని భక్తులు గత 27 రోజులలో అనగా 27.06.2025 నుండి 23.07.2025 ఓం నమశ్శివాయ వరకూ సమర్పించడం జరిగింది.
అలాగే ఈ హుండీలో 25 గ్రాముల 600 మిల్లీగ్రాముల బంగారు 11 కేజీల 550 గ్రాముల వెండి లభించాయి.
అదేవిధంగా 475 యుఎస్ఏ డాలర్లు 70 యూఏఈ ధీరమ్స్ 1300 ఒమన్ బైసా 155 కెనడా డాలర్లు 35 ఆస్ట్రేలియా డాలర్లు 40 ఇంగ్లాండ్ ఫౌండ్స్ రెండు సింగపూర్ డాలర్లు 50 న్యూజిలాండ్ డాలర్లు 5 స్కాట్లాండ్ ఫౌండ్స్ 30 ఈరోస్ 1- సౌదీ రియాల్స్ 51 కత్తార్ రియాల్స్ ఒకటి మలేషియా రింగిగ్స్ 200 ఇథియోపియన్ 220 శ్రీలంక డాలర్లు 160 నేపాల్ రూపాయలు మొదలైన విదేశీ కరెన్సీ కూడా ఈ హుండీల లెక్కింపులో లభించాయి.
పటిష్టమైన భద్రత ఏర్పాట్ల మధ్య సీసీ కెమెరాలు నిఘాతో ఈ లెక్కింపును చేపట్టడం జరిగింది.
ఈ హుండీల లెక్కింపులో ఆలయ కార్యనిర్వణ అధికారి ఎం శ్రీనివాసరావు డిప్యూటీ కార్య నిర్వహణ అధికారి ఆర్ రవణమ్మ పలు విభాగాల యూనిట్ అధికారులు పర్యవేక్షకులు సిబ్బంది శివసేవకులు తదితరులు పాల్గొన్నారు.