తెలంగాణ రాష్ట్రంలో ఐదు రోజులపాటు భారీ వర్షo ప్రజలు అప్రమత్తంగాఉండాలి

తెలంగాణ రాష్ట్రంలో ఐదు రోజులపాటు భారీ వర్షo ప్రజలు అప్రమత్తంగాఉండాలి
వాడబలిజ రాష్ట్ర అధ్యక్షుడు డర్ర దామోదర్
ములుగు ప్రతినిధి జూలై 24 యువతరం న్యూస్:
ముఖ్యంగా గోదావరి పరివాహక ప్రాంతాల జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాల సూచన పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాడ బలిజ సంఘం రాష్ట్ర అధ్యక్షులు డర్ర దామోదర్ ప్రజలకు సూచించారు,అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దు. గత 24 గంటల నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న అతి భారీ వర్షాలు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, భూపాలపల్లి,ములుగు మరియు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విస్తారంగా కురుస్తున్న వర్షాల వలన రానున్న మరో ఐదు రోజుల పాటు భారీ వర్షాలు ఉన్నందున ముఖ్యంగా మహారాష్ట్ర ముంబై నగరాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నందున గోదావరి పొంగి ప్రవహించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి,గోదావరి తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని
నదులు, వాగులు, వంకలు, చెరువులు,కుంటలు పొంగి ఉదృతంగా ప్రవహిస్తూ రోడ్ల పైకి నీరు చేరే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు, భద్రాచలం టు వెంకటాపురం రహదారి మార్గమధ్యలో ఏకన్న గూడెం వద్ద కుంగిపోయిన బ్రిడ్జి ప్రవహించే వరద తాకిడికి తాత్కాలికంగా వేసిన రోడ్డు పూర్తిగా కొట్టుకుపోవడంతో రాకపోకలకు ఆటంకం వాటిల్లింది,అత్యవసర వైద్యం సేవల కొరకు ప్రజలు వెళ్లాలి అనుకుంటే మణుగూరు మీదుగా భద్రాచలం వెళ్లాలని సూచించారు, కావునా కాళీ నడక మరియు వాహనాలతో ప్రజలు రోడ్లు దాటేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని ఉదృతంగా ప్రవహించే నీటి ప్రదేశాల్లోకి వెళ్లి ప్రమాదాన్ని కొని తెచ్చు కోరాదని
ముఖ్యంగా మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదని పశువుల కాపర్లు వాగులు దాటావద్దని సూచించారు.