ANDHRA PRADESHOFFICIAL
ఎమ్మెల్యే కేఈ శ్యామ్ కుమార్ చొరవతో వెల్దుర్తి తాగునీటి సమస్య పరిష్కారం

ఎమ్మెల్యే కేఈ శ్యామ్ కుమార్ చొరవతో వెల్దుర్తి తాగునీటి సమస్య పరిష్కారం
వెల్దుర్తి జులై 23 యువతరం న్యూస్:
పట్టణంలో తాగునీటి సమస్యపై ఎమ్మెల్యే కేఈ శ్యాం కుమార్ ప్రత్యేక దృష్టి సాధించారు. ఎమ్మెల్యే ఆదేశాల మేరకు మాజీ ఎంపీపీ తెదేపా నాయకులు ఎల్.ఈ .జ్ఞానేశ్వర్ గౌడ్ బ్రహ్మేశ్వర మైన్స్ నుంచి ప్రత్యేకంగా తాగునీటి పైప్ లైన్ కు మంగళవారం భూమి పూజ నిర్వహించారు. దాదాపు 8 ఇంచుల వాటర్ సప్లై పట్టణంలోకి సరఫరా అవుతుందని, ప్రజలకు నీటి సమస్య పరిష్కారం అవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి ఐజయ్య, వీరభద్రుడు,శ్రీనివాసులు, వడ్డెర సంఘం మండల అధ్యక్షుడు వడ్డే మహేష్ బాబు, వడ్డే మల్లికార్జున, విద్య కమిటీ చైర్మన్ రాజేష్ ,హరి, రంగస్వామి, రఘు ,ఆర్డబ్ల్యూఎస్ ఏఈ మునెయ్య,
పంచాయతీ కార్యదర్శి లక్ష్మీనాథ్, కాంట్రాక్టర్ వేణు తదితరులు పాల్గొన్నారు.