ANDHRA PRADESHOFFICIAL
మహాత్మ జ్యోతిరావు పూలే పాఠశాల ప్రిన్సిపల్ గా నరసమ్మ

మహాత్మ జ్యోతిరావు పూలే పాఠశాల ప్రిన్సిపల్ గా నరసమ్మ
వెల్దుర్తి జులై 23 యువతరం న్యూస్:
మండల కేంద్రమైన వెల్దుర్తి లోని మహాత్మ జ్యోతిరావు పూలే పాఠశాల ప్రిన్సిపల్ గా నరసమ్మ మంగళవారం పదవి బాధ్యతలు చేపట్టారు. ఈమె గతంలో శ్రీ సత్యసాయి పుట్టపర్తి జిల్లాలోని టేకులోడు పాఠశాలలో విధులు నిర్వహిస్తూ బదిలీపై వెల్దుర్తికి రావడం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పాఠశాల అభివృద్ధికి ప్రతి ఒక్కరు సహకరించాలన్నారు. పాఠశాలను రాష్ట్రస్థాయిలో ప్రథమ స్థానంలో ఉంచేలా అందరం కలిసి కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ సురేంద్ర తదితరులు పాల్గొన్నారు.