ఎరువుల దుకాణముల తనిఖీ


ఎరువుల దుకాణముల తనిఖీ
వెల్దుర్తి జులై 23 యువతరం న్యూస్:
వెల్దుర్తి పట్టణములోని ఎరువులు దుకాణములను తనిఖీ చేసి దుకాణములలోని రిజిస్టర్లను గోడౌన్ లలో ఉన్న ఎరువుల నిల్వలను మంగళవారం తనిఖీ చేయడం జరిగిందని మండల వ్యవసాయ శాఖ అధికారి అక్బర్ బాషా తెలిపారు.
శ్రీ వెంకట రమణ ట్రేడర్స్, మన గ్రోమోర్ మరియు అర్షిత క్రాప్ కేర్ సెంటర్ ఎరువుల దుకాణములను తనిఖీ చేసి స్టాకు రిజిస్టరుకు మరియు ఈపాస్ మిషన్ భౌతిక నిల్వలను పరిశీలించడం జరిగిందన్నారు.
డీలర్లు రోజు వారీగా స్టాకు బోర్డులు మరియు స్టాకు రిజిస్టర్లను విధిగా నిర్వహించాలని ఆదేశించడం జరిగింది.
యూరియా ఎరువును తప్పనిసరిగా ఈ పాస్ మిషన్ల ద్వారా ఎమ్మార్పీ ధరకు మాత్రమే రైతులకు క్రయవిక్రయాలు జరపాలని ఆదేశించడం జరిగిందన్నారు.నర్సాపురం గ్రామములో పొలంపిలుస్తోంది కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని తెలిపారు.
కార్యక్రమములో రైతులకు ఉచితంగా ఎల్ ఆర్ జి 52 కంది రకాన్ని ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది అని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఏ. పత్తికొండ ఏ డి ఏ మోహన్ విజయ్ కుమార్ పాల్గొన్నారు.



