కూటమి ప్రభుత్వంలోనే ప్రజలకు సుపరిపాలన


కూటమి ప్రభుత్వంలోనే ప్రజలకు సుపరిపాలన
తుగ్గలి జులై 21 యువతరం న్యూస్:
సుపరిపాలనలో తొలి
అడుగు – ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాన్ని ఆదివారం రాంపల్లి గ్రామంలో టిడిపి నాయకులు నిర్వహించారు. ఈ సందర్భంగా శాలివాహన ఫెడరేషన్ మాజీ చైర్మన్, టిడిపి రాష్ట్రకార్యనిర్వహణ కార్యదర్శి తుగ్గలి నాగేంద్ర, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ బత్తిన వెంకట రాముడు,టిడిపి మండల కన్వీనర్ తిరుపాల్ నాయుడు,లు కూటమి ప్రభుత్వం ఏడాది కాలంలో చేపట్టిన ప్రజా సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులు గురించి ఇంటింటికీ వివరిస్తూ, కరపత్రాలు పంపిణీ చేశారు. అనంతరం గ్రామస్తులతో కలిసి నేరుగా సమస్యల ను ప్రజలు అడిగి తెలుసుకున్నారు.
గత వైసీపీ ప్రభుత్వంలో ప్రజల హక్కులును కాలరాసారని, జగన్ నియంతృత్వంతో రాష్ట్రం అభివృద్ధి లో అధోగతి పాలైందని తెలిపారు. అస్తవ్యస్తమైన ఆర్థిక వ్యవస్థను ముఖ్యమంత్రి చంద్రబాబు చక్కదిద్దుతూనే పేదలకు సంక్షేమ పథకాలు అంద చేయడం జరిగిందన్నారు. తల్లికి వందనంతో తల్లులు సంతోషంగా ఉన్నారని. దీపం కింద ఉచిత గ్యాస్ సిలిండర్లతో మహిళలు వంటింట కష్టాలు తీరాయున్నారు. ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పెంపుతో వృద్ధులు వితంతువులు దివ్యాంగులు కు ఆర్థిక భరోసా దొరికిందని ఆనందంగా ఉన్నారన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు బిసి వెంకటస్వామి, చంద్రశేఖర్ యాదవ్, మిద్దె వెంకటేష్ యాదవ్, బాలన్న, మాజీ ఎంపీపీ కొమ్ము వెంకటేష్, బర్మా విరేష్, టిడిపి మండల ఉపాధ్యక్షులు వెంకట్రామ చౌదరి, శ్రీనివాసులు గౌడు, రామకొండ మాజీ సర్పంచ్ మసాలా శీను, శివ రాముడు,సంఘాల కృష్ణ, వల్లే వెంకటేష్, కృష్ణయ్య, కొత్తూరు చక్రపాణి,ఎడవల్లి తిమ్మప్ప, సొసైటీ డైరెక్టర్ రాంపల్లి శ్రీనివాసులు, నల్లగుండ్ల రవి, ఫీల్డ్ అసిస్టెంట్ హేమేంద్ర నాయుడు, రాతన మై రాముడు, వివిధ గ్రామాల టిడిపి నాయకులు,కార్యకర్తలు,తదితరులు పాల్గొన్నారు.



