ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఆఫీస్ పై దాడిని త్రీవంగా ఖండించిన వాడ బలిజ సేవా సంఘం

ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఆఫీస్ పై దాడిని త్రీవంగా ఖండించిన వాడ బలిజ సేవా సంఘం
రాష్ట్ర అధ్యక్షుడు దామోదర్
ములుగు ప్రతినిధి జూలై 15 యువతరం న్యూస్:
హైదరాబాద్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న మీద మరియు Q న్యూస్ ఆఫీస్ జరిగిన దాడిని ఖండిస్తున్న బీసీ సంఘాలు ముఖ్యంగా వాడ బలిజ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షులు దామోదర్ మాట్లాడుతూ,,ఈ మధ్యకాలంలో బీసీ ఉద్యమ నాయకుడు తీన్మార్ మల్లన్న బీసీ నినాదంతో ముందుకు వచ్చి బీసీల హక్కుల కోసం పోరాడుతున్నటువంటి నాయకుడు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న తెలంగాణ రాష్ట్రంలోని బీసీ బిడ్డలందరినీ కూడా ఒక తాటిపై తీసుకు వస్తున్నటువంటి నాయకుడు తీన్మార్ మల్లన్న అటువంటి నాయకుడిపై క్యూ న్యూస్ ఆఫీసుపై దాడి చేయడానికి తీవ్రంగా ఖండిస్తున్న తెలంగాణ రాష్ట్ర వాడ బలిజ సేవా సంఘం, (బిసిఏ) ఏదైనా ఉంటే చట్టపరమైన చర్యలు తీసుకోవాలి గానీ దౌర్జన్యంగా దాడులు చేయడం సరికాదని బీసీలు ఐక్యమవుతుంటే చూడలేని వివిధ సంఘాల నాయకులు రెచ్చగొట్టే ధోరణిపై ఆగ్రహం వ్యక్తం చేశారు,మును ముందు ఇటువంటి సంఘటనలు జరగకుండా చూసుకోవాలని ఇదే రిపీట్ అయితే తెలంగాణ రాష్ట్రంలోని బీసీ సంఘాలన్నీ ఐక్యంగా పోరాడి మిమ్మల్ని తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ కూడా తిరగబోనివ్వమని హెచ్చరించారు.