తలసేమియా వ్యాధి చిన్నారులకు రక్తదానం చేసిన యువకులు

తలసేమియా వ్యాధి చిన్నారులకు రక్తదానం చేసిన యువకులు
ఏబి వి పి డోన్ శాఖ ఆధ్వర్యంలో ఏబీవీపీ77వ స్థాపన దినోత్సవం సందర్భంగా శోభయాత్ర మరియు రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది
డోన్ ప్రతినిధి జులై 10 యువతరం న్యూస్:
అఖిలభారతీయ విద్యార్థి పరిషత్ డోన్ శాఖ ఆధ్వర్యంలో ఏ బి విపి 77వ స్థాపన దినోత్సవం సందర్భంగా పట్టణంలోని స్వామి వివేకానంద విగ్రహం దగ్గర నుంచి పాత బస్టాండ్ గాంధీ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించుకుని గాంధీ విగ్రహం వద్ద ఏబీవీపీ జెండా ఆవిష్కరణ సందూ రమణ, చేత చేయించడం జరిగింది. అనంతరం స్వచ్ఛంద రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది రక్తదాన శిబిర ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా టౌన్ సిఐ ఇంతియాజ్ భాష, రావడం జరిగింది ఈ కార్యక్రమంలో ఏబీవీపీ రాసి పోగుల రవి శేఖర్ మాట్లాడుతూ….. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కేవలం విద్యార్థుల యొక్క సమస్యల కోసమే కాకుండా దేశం కోసం కూడా పనిచేస్తుంది సుభాష్ చంద్రబోస్ చెప్పినట్లు నీవు ఒక రక్తపు చుక్క నాకు ఇవ్వు నీకు స్వతంత్రం ఇచ్చి చూపిస్తా అన్న మాటను ఉద్దేశపూర్వకంగా తీసుకొని ఎంతోమంది చిన్నారులు తల సేమియా వ్యాధితో బాధింపబడుతున్నందువల్ల వారికి సహాయంగా ఈ యొక్క రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది అని అన్నారు.
ఈ కార్యక్రమంలో మోహన్ గౌడ్, మాట్లాడుతూ… ఏబీవీపీ విద్యార్థులకు జాతీయ భావాలను సమాజం పట్ల ఎలా నడుచుకోవాలి విద్యార్థి పరిషత్ అనేది కేవలం విద్యార్థుల కోసమే కాకుండా జాతీయ పునర్నిర్మానాన్ని ధ్యేయంగా పెట్టుకొని విద్యార్థులను మంచి బాటలోకి తీసుకొస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు అభిషేక్, రాష్ట్ర మోర్చ ఉపాధ్యక్షులు హేమ సుందర్ రెడ్డి,రాజా థియేటర్ యజమాని రాణ, రాజ్ పుత్ కామ్లేలేస్,ఆర్మీ రామయ్య, వెంకటేశ్వర్లు, భరణి రమేష్, మంజునాథ్, హుస్సేన్ భాష, సోహెల్ తదితరులు పాల్గొన్నారు.