ఊర వల్ల కాడ ….? ఎస్సీ కాలనీకి కరెంటు ఇవ్వడానికి ఎన్ని రోజులు

ఊర వల్ల కాడ ….?
ఎస్సీ కాలనీకి కరెంటు ఇవ్వడానికి ఎన్ని రోజులు …
ట్రాన్స్ఫర్ ఎత్తడానికి ఓనర్ కి లేని అభ్యంతరము పక్కింటి అతనికి ఎందుకు ….?
విద్యుత్ అధికారుల చేతగానితనం ,,,,,?
గార్లదిన్నె జూలై 10 యువతరం న్యూస్:
మండల పరిధిలోని ఇల్లూరు గ్రామంలో ఎస్సీ కాలనీలో ట్రాన్స్ఫారం పెట్టడానికి విద్యుత్ అధికారులు ఎన్ని రోజులు సమయం తీసుకుంటారు,ఇప్పటివరకు రెండు రోజులు కరెంటు లేకుండా కనీసము 100 ఇల్లు చీకటిలో మగ్గుతున్నాయి అందులో చిన్నపిల్లలు గర్భవతులు ఉన్న పరిస్థితి ఉందని,ఇది ఆది మానవుని కాలమా, లేక ఆధునిక నాగరికత కాలమా అని ఎస్సీ కాలనీలోని ప్రజలు వాపోతున్నారు, ట్రాన్స్ఫారం పెట్టడానికి ఇంటి యజమానికి అభ్యంతరము పక్కింటి అతనికి ఎందుకు అతనికి ఇదే ట్రాన్స్ఫర్ పరిధిలో ఇంటికి కరెంట్ రావడానికి ఒకటే మార్గం అయినా కూడా అతని వల్ల ఆ ట్రాన్స్ఫారం పరిధిలోని ఎస్సీ కాలనీ ప్రజలు ఇబ్బంది పడుతున్నామని,ఆందోళన వ్యక్తం చేశారు,అభ్యంతర జరిగిన వ్యక్తికి ట్రాన్స్ఫారం వేసే చోటు ఏమాత్రం సంబంధం లేదని,ఆ వ్యక్తికి ఎటువంటి పట్టా లేదని అయినా కూడా,తల యజమానికి లేని అభ్యంతరము,అతనికి ఎందుకని ఎస్సీ కాలనీ గ్రామస్తులు వాపోతున్నారు,విద్యుత్ అధికారుల చేతగానితనం చేవలేని తనంగా ఎస్సీ కాలనీ ప్రజలు వాపోతున్నారు.ఇదే విషయం పంచాయతీ అధికారులకు తెలిసిన వారు ఏమీ చేయలేకపోతున్నారని,విద్యుత్ మండల అధికారి మా ఎస్సీ కాలనీలో చీకటిలో ఉంచితే ఎస్ ఈ కి కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామని,ఇది ముమ్మాటికి విద్యుత్ అధికారులు వైఫల్యం అని,ఎస్సీ కాలనీలోని ప్రజలుఆందోళనలో ఉన్నారు,వెంటనే ఈ సమస్య పరిష్కరించకపోతే,కలెక్టర్ కార్యాలయం ఎదుట పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని తెలిపారు.